హైదరాబాద్- విజయవాడ ప్రయాణిలకు గుడ్ న్యూస్! తగ్గనున్న జర్నీ టైమ్!

Hyderabad- Vijayawada Highway Expansion Works: రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాలు. అంతేకాక రెండు రాష్ట్రాల రాజధానులు  కూడా ఈ రెండు నగరాలు. ఈ మార్గంలోని ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది.

Hyderabad- Vijayawada Highway Expansion Works: రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాలు. అంతేకాక రెండు రాష్ట్రాల రాజధానులు  కూడా ఈ రెండు నగరాలు. ఈ మార్గంలోని ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది.

నిత్యం ఎంతో మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉటుంది. అలాంటి మార్గాల్లో  హైదారాబాద్, విజయవాడ మార్గం ఒకటి. ఈ జాతీయ హైవేపై నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి.  ఈ క్రమంలో తాజాగా విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన ఈ రెండు మహా నగరాల మధ్య జర్నీని మరింత సౌలభ్యంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకు పడింది. మరి.. అసలు ఆ గుడ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాలు. అంతేకాక రెండు రాష్ట్రాల రాజధానులు  కూడా ఈ రెండు నగరాలు. రెండు పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది జర్నీ చేస్తుంటారు. ఇక మార్గంలో రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచూ ఆ మార్గంలో రోడ్డు అభివృద్ధి పనులు సాగిస్తుంటాయి. తాజాగా ఈ మార్గంలో ప్రయణం చేసే ప్రజలకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఓ ప్లాను అమలు చేయనుంది.

హైదరబాద్, విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిని ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు వీలుగా జాతీయ రహదారి ప్రాధికార సంస్ధ వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పనులకు సంబంధించి గతంలో టెండర్లు జీఎంఆర్ సంస్థ దక్కించుకుంది. అయతే ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో దాని స్ధానంలో మరో కాంట్రాక్టర్ ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రూ.700 కోట్ల బడ్జెట్ తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లు పిలవబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పరిధిలో 181 కి.మీ మేర ఉన్న ఈ రహదారిని గతంలో నాలుగు లైన్లుగా విస్తరించారు.  కానీ ఆరు లైన్ల విస్తరణ సాధ్యం కాలేదు. కానీ అప్పటికే భూసేకరణ జరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఈ రహదారి విస్తరణ పనులకు డీపీఆర్ తయారీకి ఓ ప్రైవేటు సంస్ధకు పనులు అప్పగించబోతున్నారని సమాచారం. అంతా ఓకే అయితే వెంటనే పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని వేగంగా పూర్తి చేసి.. వాహనదారులకు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం  భావించింది. ఇది పూర్తయితే ఈ మార్గం మధ్య జర్నీ టైమ్ తగ్గడంతో పాటు జర్నీ వేగం బాగా పెరగనుంది.

Show comments