iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ మరోసారి అడ్డంగా బుక్కయ్యింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద చేసిన దుష్ప్రచారం బూమరాంగ్ అయ్యింది. మంత్రిని టార్గెట్ చేస్తూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న ప్రచారానికి మంత్రి ఇచ్చిన వివరణ పచ్చ పార్టీ నేతలకు మింగుడుపడకుండా తయారయ్యింది. చాలామంది టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టుగా తయారయ్యింది.
మంత్రి ఎన్నికల అఫిడవిట్ లో తనకు కారు కూడా లేదని పేర్కొన్నారని, కానీ ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్ లో 5 కోట్లు ఖర్చు చేసి రష్యా ప్రయాణమయ్యారని టీడీపీ ఆరోపించింది. కానీ తీరా చూస్తే ఆ ఫ్లైట్ లో మంత్రితో పాటుగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ఉండడంతో టీడీపీ చేసిన ప్రచారంలో డొల్లతనం బయటపడింది. మంత్రి ఒక్కరే ఫ్లైట్ వేసుకుని వెళ్లారన్నట్టుగా చేసిన ప్రచారం వాస్తవం కాదని తేలిపోయింది. పైగా టీడీపీ నేతలు కూడా మంత్రి వెంట ఉండడంతో వ్యవహారం బెడిసికొట్టింది.
రష్యాలో తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని మంత్రి తేల్చిచెప్పారు. అధికారిక యాత్ర కాదని వెల్లడించారు. తనతో పాటు కొందరు స్నేహితులు కూడా ఉన్నారని, అందులో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారని వెల్లడించారు. దాంతో టీడీపీ శ్రేణులకు ఎటూ పాలుపోని పరిస్థితి అయ్యింది. స్వయంగా టీడీపీ నేతలు కూడా అదే విమానంలో ప్రయాణిస్తుంటే మంత్రిని మాత్రమే నిందించడం వల్ల ఏమి ఉపయోగం అనే ప్రశ్న వస్తోంది. మంత్రి 5 కోట్ల ఫ్లైట్లో వెళ్లారని నిందలు వేస్తున్న టీడీపీ తన ఎమ్మెల్యే గురించి ఏం చెబుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితి ఏర్పడింది.
బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటన చుట్టూ అనేక అర్థసత్యాలను, గాలి కథలను పోగేసి ప్రచారం చేసిన పచ్చ మీడియాకి కూడా ఇది గొంతులో పచ్చి వెలక్కాయ అన్నట్టుగా తయారయ్యింది. మంత్రి ఒక్క స్టేట్ మెంట్ తో గాలివార్తల దుమారం తేలిపోయిందని చెప్పవచ్చు.
Also Read : ఆయన పాలన కమ్యూనిస్టులకూ ఇష్టం