P Krishna
P Krishna
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చిన్న వయసు నుంచి వృద్ద మహిళల కామాంధులు ఎవరినీ వదలడం లేదు. నిత్యం ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమ పేరుతో వేధించడం.. తమ ప్రేమను కాదని యువతులను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఎంతో ఉన్నత చదువు చదువుకొని మంచి భవిష్యత్ ఉన్న ఓ యువతి అత్యంత దారుణంగా హత్యచేయబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన బాగల్ కోటే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బాగల్ కోటె జిల్లా ఇలకల్ కు చెందిన పారా మెడికల్ స్టూడెంట్ అయిన సుమన మనోహర్ పత్తార్ బాగల్ కోటేలోని కుమారేశ్వర పారా మెడికల్ కాలేజ్ లో ఫిజియోథెరపీ మూడవ సంవత్సరం చదువుతుంది. హాస్టల్ నుంచి కాలేజ్ కి వెళ్లిన తమ కూతురు కనిపించడం లేదని సెప్టెంబర్ 14న సుమన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే 16న సిగీకెరె క్రాస్ రైల్వే బ్రడ్జీ కింద సుమన మృతదేహం లభించిందని బాగల్ కోటె జిల్లా ఎస్పీ అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపిపారు.
తమ కూతురు మంచి చదువు చదువుకొని పదిమందికి సేవ చేస్తుందని ఎంతో ఆశపడ్డామని.. ఇంతలోనే హత్యకు గురి కావడం షాక్ కి గురి చేసిందని సుమన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నింధితులను వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా, పారా మెడికల్ విద్యార్థిని సుమన దారుణ హత్యకు గురి కావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.