Free Bus Journey: మగాళ్ల కోసం నారాయణ పథకం? మాకు ఫ్రీ బస్ జర్నీ కావాలంటూ డిమాండ్..

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ జర్నీ అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికే అమలవుతోన్న కర్ణాటకలో ఈ పథకంపై అనేక విమర్శలు వస్తున్నాయట. ఆ వివారలు..

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ జర్నీ అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికే అమలవుతోన్న కర్ణాటకలో ఈ పథకంపై అనేక విమర్శలు వస్తున్నాయట. ఆ వివారలు..

తెలంగాణ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. రేవంత్ రెడ్డి.. తొలి సంతకం ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే పెట్టారు. ఇక నేటి నుంచి ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్ జర్నీ పథకం అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 9, శనివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే తెలంగాణలో కన్నా ముందు.. కర్ణాటక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడ మహిళలకు ఉచిత బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకం వల్ల అక్కడ ఇప్పటికే అనేక సమస్యలు తలెత్తుతున్నాయంట.

ఈ సౌకర్యం వచ్చాక కర్ణాటకలో ఇంటి పని మనుషుల, వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో మహిళా కార్మికుల కొరత తలెత్తినట్టు అక్కడ మీడియాలో వార్తలు వచ్చాయి. అలానే దేవాలయాలు కిక్కిరిసిపోవడంతో ఉచిత అన్నదాన కార్యక్రమాలు బంద్ చేశారంట. చిన్నచిన్న గొడవలకే భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం వంటి సామాజిక సమస్యలు తలెత్తాయి అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగింది.

ఉచిత బస్సు ప్రయాణం కల్పించినంత మాత్రానా ఖర్చులకు డబ్బులుండొద్దా అనే అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు. అందుకు పరిష్కారం కూడా ప్రభుత్వమే చూపించింది కదా.. అంటున్నారు. ఇదే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఆడవారికి నెలకు 2500 రూపాయలు కూడా చెల్లిస్తోంది కదా ఇంకేం అంటున్నారు.

అయితే మహిళలకు కల్పించిన ఈ సౌకర్యాలపై కర్ణాటకలో కొందరు పురుషులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సాయం, ఉచితాలు అన్ని మహిళలకే ఇస్తున్నారు.. మేమేం పాపం చేశాం.. ఆడవారికిచ్చే రాయితీలు తమకు కూడా ఇవ్వాలంటూ కర్ణాటక మాజీ ఎమ్మెల్యే నాగరాజు అనే పెద్దమనిషి ఉద్యమం లేవదేశారు. మహాలక్ష్మి తరహాలో పురుషులకు కూడా నారాయణ పేరుతో ఉచిత బస్సు, పింఛన్‌ ఇవ్వాలని బస్సుల్లో టికెట్‌ తీసుకోకుండా ఆందోళనలు చేస్తున్నారట.

కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి.. టికెట్ కొనని ఆడవాళ్లు బస్సుల్లో.. టికెట్ కొనుక్కున్న మగాళ్లు బస్సు బయటా, వెనుక భాగంలో వేలాడుతూ ప్రయాణిస్తున్నారు అంటూ బోలేడు మీమ్స్ వచ్చాయి. మగాళ్లు ఏం పాపం చేశారు.. మాకు కూడా ఫ్రీ జర్నీ ప్రొవైడ్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. మరి తెలంగాణలో ఈ పథకం అమలు తీరు ఎలా ఉండనుందో.. ఇక్కడ ఎలాంటి డిమాండ్లు లేవదీస్తారో చూడాలి. ఇప్పటికే ఆటో డ్రైవర్లు.. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ ఉపాధికి గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show comments