India Fans Trolling Australia After World Cup Victory: వరల్డ్ కప్​కు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇది.. ఆసీస్​కు ఇచ్చి పడేసిన భారత ఫ్యాన్స్!

Rohit Sharma: వరల్డ్ కప్​కు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇది.. ఆసీస్​కు ఇచ్చి పడేసిన భారత ఫ్యాన్స్!

T20 World Cup 2024 Final: పొట్టి ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టును అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది కదా ఆట అంటే, ఇలా కదా ఆడాల్సింది అని అంటున్నారు. కప్పు కల తీర్చారు, మీకు సెల్యూట్ అని మెచ్చుకుంటున్నారు.

T20 World Cup 2024 Final: పొట్టి ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టును అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది కదా ఆట అంటే, ఇలా కదా ఆడాల్సింది అని అంటున్నారు. కప్పు కల తీర్చారు, మీకు సెల్యూట్ అని మెచ్చుకుంటున్నారు.

టీ20 ప్రపంచ కప్-2024ను నెగ్గిన భారత జట్టును అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది కదా ఆట అంటే, ఇలా కదా ఆడాల్సింది అని అంటున్నారు. కప్పు కల తీర్చారు, మీకు సెల్యూట్ అని మెచ్చుకుంటున్నారు. కప్పు గెలిచిన భారత్​తో పాటు రన్నరప్​గా నిలిచిన సౌతాఫ్రికాను కూడా ప్రశంసిస్తున్నారు. ఆ టీమ్ ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని అంటున్నారు. ప్రొటీస్ పోరాటం వల్లే మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇలా రోహిత్-మార్క్రమ్ సేనల్ని మెచ్చుకుంటున్న భారత అభిమానులు.. ఆస్ట్రేలియాను మాత్రం ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్. ఆ మ్యాచ్ ముగిశాక కప్పు గెలిచిన ఆనందంలో కంగారూ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేశారు. ఆ టీమ్ ఆల్​రౌండర్ మిచెల్ మార్ష్​ అయితే ఏకంగా కప్పుపై కాళ్లు పెట్టాడు.

వరల్డ్ కప్ గెలిచాక డ్రెస్సింగ్ రూమ్​లో మార్ష్​ ప్రవర్తించిన తీరు అప్పట్లో క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. కప్పు మీద కాళ్లు పెట్టి ఫొటోలకు పోజులు ఇచ్చాడు మార్ష్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియాకు ఆడటం తప్ప ఏదీ తెలియదని.. ఎంతో ప్రతిష్టాత్మకమైన కప్పుకు ఇచ్చే వ్యాల్యూ ఇదేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా దాన్ని ఆసీస్ ఆటగాళ్లు గానీ ఆ దేశ బోర్డు ఖండించిన దాఖలాలు లేవు. దీన్నే ఇప్పుడు భారత ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. తాజాగా టీ20 ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరును వాళ్లు హైలైట్ చేస్తున్నారు. వరల్డ్ కప్​ను గుండెలకు హత్తుకొని ఆస్వాదించాడు హిట్​మ్యాన్.

కప్పు గెలిచాక ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు రోహిత్. సహచర ఆటగాళ్లను పట్టుకొని ఏడ్చేశాడు. ఆఖరి ఓవర్ వేసి మ్యాచ్​ను మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యాకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని మైదానంలో నాటాడు. కప్​ను పట్టుకొని కోహ్లీతో కలసి ఫొటోలకు పోజులు ఇచ్చాడు. ఇదే క్రమంలో కప్​ను తన గుండెకు హత్తుకున్నాడు. దీంతో గత ప్రపంచ కప్​లో ఆసీస్ ప్లేయర్ మార్ష్​ కాళ్లు పెట్టిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ పనితో కప్పును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కోట్లాది మంది క్రికెట్ లవర్స్ మనసుల్ని అతడు గాయపరిచాడని అంటున్నారు. అదే రోహిత్ అందరి హృదయాలు గెలుచుకున్నాడని చెబుతున్నారు. రెండు దేశాల కల్చర్ మధ్య ఉన్న తేడా ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు. భారత్​లో చిన్నప్పటి నుంచే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పిస్తారని.. నిన్న రోహిత్ కప్​కు ఇచ్చిన గౌరవం, దానిపై చూపించిన ప్రేమనే దీనికి సాక్ష్యమని అంటున్నారు. అదే ఆసీస్​లో ఇవేవీ నేర్పించరని.. దేన్నైనా ఈజీగా తీసుకోవడం, డోన్ట్ కేర్ యాటిట్యూడ్​ వల్ల అక్కడి వాళ్లు అలా బిహేవ్ చేస్తుంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments