Virat Kohli: పాకిస్థాన్‌ కరెన్సీ నోట్లపై కోహ్లీ ఫొటో! ఫేక్‌ కాదు.. అసలు విషయం ఏంటంటే?

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులున్న విషయం తెలిసిందే. అంతేందుకు మన శత్రుదేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. ఇప్పుడు పాకిస్థాన్‌ కరెన్సీపై కోహ్లీ ఫొటో అంటూ వార్తలు వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులున్న విషయం తెలిసిందే. అంతేందుకు మన శత్రుదేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. ఇప్పుడు పాకిస్థాన్‌ కరెన్సీపై కోహ్లీ ఫొటో అంటూ వార్తలు వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

టైటిల్‌ చూసి చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు కదా.. అయితే కొంతమంది ఫేక్‌ అని, ఎడిటెడ్‌ ఇమేజ్‌ అని కూడా భావించి ఉంటారు. కానీ, ఇది నిజం. పాకిస్థాన్‌ కరెన్సీపై విరాట్‌ కోహ్లీ ఫొటో ముద్రించమని అధికారింగా ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దాని కోసం ఆ దేశ జాతీయ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ పెట్టిక ఒక కాంపిటీషన్‌లో విరాట్‌ కోహ్లీ ఫొటోతో కరెన్సీ ముద్రించాలని డిమాండ్‌ భారీ స్థాయిలో వచ్చింది. ఒక స్టార్‌ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మనకు శత్రు దేశమైన పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆ దేశ కరెన్సీ నోట్లపై కోహ్లీ ఫొటో ముద్రించాలనే డిమాండ్‌ వ్యక్తం అవ్వడమే కాదు.. అందుకోసం ఎంట్రీలు కూడా వెళ్లాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ ఇటీవల ఒక కాంపిటీషన్‌ పెట్టింది. అదేంటంటే.. కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ప్రజల నుంచి కొత్త డిజైన్లను ఆహ్వానించింది. దీంతో చాలా మంది తమ దేశ కరెన్సీ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా డిజైన్‌ చేసి ఆర్ట్‌ రూపంలో పంపించారు. మన దేశ కరెన్సీపై మహాత్మ గాంధీ ఫొటో ఉన్నట్లు.. పాకిస్థాన్‌ కరెన్సీపై ఆ దేశ జాతిపిత మహమ్మద్‌ అలీ జిన్నా ఫొటో ఉంటుంది. అయితే.. ఫొటో మార్చకుండా.. కొత్త డిజైన్‌ పంపాల్సిందిగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ కోరింది. కానీ, కొంతమంది మాత్రం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌కు షాకిచ్చారు.

కొత్త కరెన్సీ నోట్లపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫొటోతో డిజైన్‌ చేసి.. మరీ పంపించారు. కోహ్లీ ఫొటోతో పాటు కొన్ని ఎంట్రీలు బాబర్‌ అజమ్‌ ఫొటోతో కూడా వచ్చాయి. పాకిస్థాన్‌ అంటే క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశం. ఇండియా తర్వాత క్రికెట్‌ను అంతలా ఆరాధించే దేశం ఏదంటే పాకిస్థానే. అయితే.. ఇలా దేశ కరెన్సీపై కూడా వారి క్రికెట్‌ పిచ్చి చూసి.. బ్యాంక్‌ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఆయా ఎంట్రీలను లెక్కలోకి తీసుకోరు. నిబంధనలకు లోబటి ఉన్న ఎంట్రీలను మాత్రమే పరిగణంలోకి తీసుకోనున్నారు. మరి పాకిస్థాన్‌ నోట్లపై కోహ్లీ ఫొటో ముద్రించాలనే డిమాండ్‌ పాకిస్థానీయుల నుంచే రావడంపై మీ అభిప్రాయాలన కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments