ఎంత బతిమిలాడినా అతడు మాట వినలేదు.. వరల్డ్ కప్ ముందు రోహిత్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్​ నుంచే జట్టు పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించాలని డిసైడ్ అయ్యాడు.

టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్​ నుంచే జట్టు పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించాలని డిసైడ్ అయ్యాడు.

టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్​ నుంచే జట్టు పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించాలని డిసైడ్ అయ్యాడు. ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోవాలని చూస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో చేజారడంతో బాధలో ఉన్న హిట్​మ్యాన్.. ఆ కసిని అంతా పొట్టి కప్పులో చూపించాలని అనుకుంటున్నాడు. ఐర్లాండ్​తో జరిగే ఫస్ట్ మ్యాచ్​లో భారీ విజయం సాధించి.. కప్పు వేటలో తాము ఎంత పట్టుదలతో ఉన్నామో చూపించాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ సెషన్స్​లో చెమటోడ్చుతున్నాడు. ఫిట్​నెస్​ను పెంచుకోవడంతో పాటు బ్యాటింగ్​ను కూడా మెరుగుపర్చుకుంటున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడాలని డిసైడ్ అయ్యాడు.

భారత్-ఐర్లాండ్ పోరుకు అంతా సిద్ధమైపోయింది. న్యూయార్క్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు ముందు రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడ్ని ఎంత బతిమిలాడినా మాట వినట్లేదని అన్నాడు. తాను ఇంక చెయ్యగలిగిందేమీ లేదని చెప్పాడు. హిట్​మ్యాన్​ అన్నది మరెవరి గురించో కాదు.. కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించే. హెడ్ కోచ్​గా పదవీకాలం పూర్తవడంతో మెగా టోర్నీ తర్వాత టీమిండియాను వీడనున్నాడు ద్రవిడ్. అతడి స్థానంలో కొత్త కోచ్​ కోసం అన్వేషిస్తోంది బీసీసీఐ. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కోచ్ అయ్యే ఛాన్స్ ఉన్నా.. తాను అప్లై చేసుకోనని, కోచ్​గా వరల్డ్ కప్​ తనకు ఆఖరిదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ పైవిధంగా రియాక్ట్ అయ్యడు. ఇంకొన్నాళ్లు టీమ్​తో ఉండాల్సిందిగా బతిమిలాడినా ద్రవిడ్ వినిపించుకోలేదన్నాడు హిట్​మ్యాన్. ​

‘కోచ్ రాహుల్ ద్రవిడ్​తో నాకు మంచి రిలేషన్ ఉంది. అతడే నా ఫస్ట్ కెప్టెన్. అతడి సారథ్యంలో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకు ఆడా. నాకు మాత్రమే కాదు.. జట్టులోని ఆటగాళ్లందరికీ ద్రవిడే బిగ్ రోల్ మోడల్. జట్టుతో ఉండమని, కోచ్​గా ఇంకొన్నాళ్లు మమ్మల్ని నడిపించమని అతడ్ని కోరా. టీమ్​ను వీడొద్దు.. కోచ్​గా కొనసాగమంటూ కన్విన్స్ చేశా. కానీ అతడు ఒప్పుకోలేదు. అతడు టీమిండియాను వదిలి వెళ్లిపోతుంటే చూడటం నా వల్ల కావడం లేదు’ అని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. దీన్ని బట్టే ద్రవిడ్​తో హిట్​మ్యాన్​కు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ కామెంట్స్ చూసిన నెటిజన్స్.. కోచ్-కెప్టెన్ మధ్య ఇంతమంచి బాండింగ్ ఉండటం అరుదని అంటున్నారు. వీళ్ల జోడీ సూపర్బ్ అని.. ద్రవిడ్ ఇంకొన్నాళ్లు కోచ్​గా కొనసాగితే బాగుండేదని చెబుతున్నారు. మరి.. ద్రవిడ్​ను బతిమిలాడినా తన మాట వినలేదంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments