Nidhan
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి.
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి.
Nidhan
క్రికెట్‌కు సంబంధించి ఇప్పుడు అందరూ టీ20 వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు ఐపీఎల్-2024 హడావుడి నడుస్తున్నా.. మెగా టోర్నీ గురించి కూడా జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం వరల్డ్ కప్ స్క్వాడ్స్ అనౌన్స్మెంట్స్ రావడమే. పొట్టి ప్రపంచ కప్‌కు ఇంకా నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు స్క్వాడ్స్‌ను ప్రకటించాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా వరల్డ్ కప్ టీమ్‌ను అనౌన్స్ చేసింది. అయితే ఆ ఇద్దరికి బోర్డు అన్యాయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టును అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యుల ఈ టీమ్‌ను హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేయనున్నాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టీమ్‌లో ఒకరిద్దరు తప్పితే కొత్తగా ఇన్క్లూడ్ అయిన వాళ్లు ఎవరూ లేరు. రోహిత్, హార్దిక్‌తో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా ఇద్దరు స్టార్లకు మాత్రం స్క్వాడ్‌లో ఛాన్స్ రాలేదు. వాళ్లే రింకూ సింగ్, కేఎల్ రాహుల్. రింకూను రిజర్వ్డ్ ప్లేయర్‌గా ఎంపిక చేసిన బోర్డు.. రాహుల్‌ను మాత్రం సెలెక్షన్‌కు పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ మధ్య కాలంలో భారత టీ20 జట్టులో రింకూ సింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సింగిల్ హ్యాండ్‌తో టీమిండియాకు చాలా విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆప్ఘానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఫినిషర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటోడ్ని సెలెక్టర్లు మెయిన్ టీమ్‌లోకి తీసుకోకుండా.. రిజర్వ్డ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అటు కేఎల్ రాహుల్ కూడా గత కొన్నేళ్లుగా టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ కూడా చేయగల సమర్థుడు. ఈ ఐపీఎల్‌లోనూ అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయినా అతడ్ని బోర్డు పట్టించుకోలేదు. రిజర్వ్డ్ ప్లేయర్‌గా కూడా అతడ్ని ఎంపిక చేయలేదు. దీంతో రింకూ, రాహుల్‌కు బోర్డు తీవ్ర అన్యాయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీమ్ తరఫున కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేసినా ఇలా మొండిచెయ్యి చూపడంతో వాళ్ల ఫ్యాన్స్ బీసీసీఐపై విమర్శలకు దిగుతున్నారు. మరి.. రాహుల్, రింకూకు జరిగిన అన్యాయం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Indian team for the T20I World Cup:
Rohit (C), Hardik (VC), Jaiswal, Kohli, Surya, Pant, Samson, Dube, Jadeja, Axar, Kuldeep, Chahal, Arshdeep, Siraj, Bumrah. pic.twitter.com/64YWJ64yr0
— Johns. (@CricCrazyJohns) April 30, 2024