టీ20 WC కోసం DKని ఒప్పించడం ఈజీ.. అతన్ని ఒప్పించడమే కష్టం: రోహిత్‌

Rohit Sharma, MS Dhoni: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌ కప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్న సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్ల గురించి రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, MS Dhoni: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌ కప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్న సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్ల గురించి రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 తర్వాత జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మిస్‌ అయిన బాధలో ఉన్న టీమిండియాకు ఈ వరల్డ్‌ కప్‌ మరో అవకాశంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అయితే.. వరల్డ్‌ కప్‌ గెలవాలనే బాగా కసితో ఉన్నారు. అందుకే ఒక వైపు ఐపీఎల్‌ జోరుగా సాగుతున్నా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ టీ20 వరల్డ్‌ కప్‌పై ఒక కన్నేసి ఉన్నారు. ఐపీఎల్‌లో ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తున్నారు? టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎవర్ని ఎంపిక చేయాలనే పనిలో వారు బిజీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మ, అజిత్‌ అగార్కర్‌ ముంబైలో భేటీ అయ్యారనే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆ భేటీలో రోహిత్‌ శర్మతో కలిసి విరాట్‌ కోహ్లీని ఓపెనర్‌గా పంపాలని, హార్ధిక్‌ పాండ్యా ఐపీఎల్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయకపోతే అతన్ని టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో పరిగణంలోకి తీసుకోకూడదని, అలాగే రియాన్‌ పరాగ్‌ను టీమ్‌లోకి తీసుకోవానే విషయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని రోహిత్‌ తేల్చేశాడు. తాజాగా డెక్కన్‌ ఛార్జెర్స్‌ మాజీ కెప్టెన్‌, ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రోహిత్‌ శర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో దినేష్‌ కార్తీక్‌, మహేంద్ర సింగ్‌ ధోని అద్భుతంగా రాణిస్తున్నారని, ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు వచ్చి ఆడింది నాలుగు బతులే కానీ, చాలా ఇంప్యాక్ట్‌ చూపించాడంటూ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. అయితే.. ధోనిని టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఒప్పించడం కష్టమని, కానీ, డీకేను ఒప్పించడం మాత్రం చాలా ఈజీ అని రోహిత్‌ సరదాగా పేర్కొన్నాడు. అలా అని టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో దినేష్‌ కార్తీక్‌కు చోటు లేదని కాదు. కానీ, కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌ లాంటి యువ క్రికెటర్లో డీకే పోటీ పడాల్సి ఉంది. మరి ధోనిని టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఒప్పించడం కష్టమని రోహిత్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments