Ravichandran Ashwin: రోహిత్, కోహ్లీ వల్ల కాలేదు.. అశ్విన్ అలవోకగా సాధించాడు!

స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్ల కాని ఓ ఫీట్​ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు. అతడు​ అందుకున్న ఆ అరుదైన ఘనత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్ల కాని ఓ ఫీట్​ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు. అతడు​ అందుకున్న ఆ అరుదైన ఘనత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత తరంలో వాళ్లిద్దరూ బెస్ట్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ తమ బ్యాట్ పవర్​తో ఫుల్ డామినేషన్ చూపిస్తున్నారు. భారత్​తో మ్యాచ్ అంటే చాలు.. వీళ్లిద్దర్నీ ఎలా ఎదుర్కోవాల్నా అని ప్రత్యర్థి జట్లు తలలు పట్టుకుంటున్నాయి. బ్యాట్లతో పరుగుల వరద పారిస్తున్న రోకో జోడీ.. రికార్డుల్లోనూ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. క్రికెట్​లోని చాలా రికార్డులను కోహ్లీ తన పేరు మీద లిఖించుకున్నాడు. రోహిత్ కూడా ఎవరికీ సాధ్యం కాని పలు రేర్ ఫీట్లు నమోదు చేశాడు. అయితే హిట్​మ్యాన్, విరాట్​కు సాధ్యం కాని ఓ ఘనతను అందుకున్నాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గతేడాదికి గానూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన టెస్ట్ టీమ్​లో ఈ స్టార్ స్పిన్నర్ చోటు దక్కించుకున్నాడు. తద్వారా వరుసగా మూడేళ్ల పాటు ఐసీసీ టెస్ట్ టీమ్​లో స్థానం సంపాదించిన ప్లేయర్​గా నిలిచాడు.

వరుసగా మూడేళ్ల పాటు ఐసీసీ టెస్ట్ టీమ్​లో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని సుసాధ్యం చేశాడు అశ్విన్. 2021లో తొలిసారిగా ఐసీసీ టెస్ట్ ఎలెవన్​లో ప్లేస్ సంపాదించాడు. ఆ తర్వాత ఏడాది కూడా అతడ్ని టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్​లో భాగం చేసింది ఐసీసీ. ఈసారి కూడా టెస్ట్ జట్టులో ప్లేస్​ కాపాడుకొని తన సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు అశ్విన్. ఒక భారత జట్టు ప్లేయర్ ఇలా వరుసగా మూడుసార్లు ఐసీసీ టెస్ట్ టీమ్​లో చోటు దక్కించుకోవడం ఇన్నేళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లకు కూడా ఇది సాధ్యం కాలేదు. దీన్ని బట్టే లాంగ్ ఫార్మాట్​లో అశ్విన్ ఎంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు, ఎంత కన్​సిస్టెంట్​గా వికెట్లు తీస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. అశ్విన్ అరుదైన ఘనతను సాధించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

అశ్విన్ సాధించింది రేర్ ఫీట్ అని.. ఆటగాళ్ల టాలెంట్, స్కిల్స్, పేషెన్స్​కు నిజమైన పరీక్ష పెట్టే టెస్టుల్లో ఇంత కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేయడం మామూలు విషయం కాదని నెటిజన్స్ అంటున్నారు. వయసు పెరుగుతున్నా కొత్త బ్యాటర్స్ సవాళ్లు విసురుతున్నా ప్రతి ఏడాది మరింత మెరుగవుతూ, టెక్నిక్​ను ఇంప్రూవ్ చేసుకుంటూ.. ఫిట్​నెస్​ను కాపాడుకోవడం వల్లే అశ్విన్ ఇంత సక్సెస్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. అతడు దీన్నే కొనసాగిస్తే టెస్టు క్రికెట్​లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడని చెబుతున్నారు. ఇక, కెరీర్​లో ఇప్పటిదాకా 95 టెస్టులు ఆడిన అశ్విన్ 490 వికెట్లు తీశాడు. మరో 10 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్​లో అతడు చేరతాడు. ఇంగ్లండ్​తో హైదరాబాద్​లో జరిగే మొదటి టెస్టులోనే ఆ క్లబ్​లో అతడు జాయిన్ అవడం ఖాయంలా కనిపిస్తోంది. కాగా, అశ్విన్ తీసిన వికెట్లలో 337 వికెట్లు భారత్​లో ఆడిన మ్యాచుల్లో పడగొట్టినవే కావడం గమనార్హం. మరి.. రోహిత్, కోహ్లీ సాధించని ఫీట్​ను అశ్విన్ సాధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments