వరల్డ్ కప్ 2023 ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. దీంతో అన్ని జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ ల్లో నిమగ్నం అయ్యారు. అయితే కొంత మంది ఆటగాళ్లు మాత్రం తమ భవిష్యత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే బంగ్లా స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా స్టార్ ప్లేయర్ సైతం తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే నా చివరి వరల్డ్ కప్ కావొచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ ప్లేయర్. దీంతో వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాను అనే సంకేతాలు ఇచ్చాడు ఈ ఆటగాడు.
వరల్డ్ కప్ 2023 జట్టులోకి అనూహ్యంగా దూసుకొచ్చాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్, వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో అశ్విన్ కు పిలుపునిచ్చింది బీసీసీఐ. ఇక అనుకోకుండా వచ్చిన ఈ అవకాశంపై అశ్విన్ ఆనందంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో జరిగే వామప్ మ్యాచ్ కోసం గువాహటి చేరుకున్న అశ్విన్.. దినేశ్ కార్తీక్ తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అశ్విన్ మాట్లాడుతూ..”లైఫ్ లో ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నేను ఇక్కడ ఉంటానని నేను ఊహించలేదు. మేనేజ్ మెంట్ నాపై నమ్మకం ఉంచింది. దానిని నేను నిలబెట్టుకుంటాను. ఇలాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే మనం ముందుకు వెళ్లగలం. బహుశా నాకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ కావొచ్చు. కాబట్టి నేను టోర్నీని ఎంతగా ఎంజాయ్ చేస్తాననేదే ముఖ్యం” అంటూ తన రిటైర్మెంట్ గురించి హింట్ ఇచ్చాడు అశ్విన్.
ఇక ఆఖరి క్షణంలో వరల్డ్ కప్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో గట్టి పోటీ ఉంది. దీంతో తన భవిష్యత్ గురించి ఈ 37 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ముందుగానే పసిగట్టినట్లు ఉన్నాడని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.