టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగిస్తూ బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ విషయంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగిస్తూ బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ విషయంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023 ముగిసినప్పటి నుంచి భారత క్రికెట్లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన అంశాలు రెండు. అందులో ఒకటి సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ రిటైర్మెంట్. ఇంకొకటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్. కోహ్లీ-హిట్‌మ్యాన్ టీ20ల్లో కంటిన్యూ అవుతారా? వన్డేలు, టెస్టులకే పరిమితం అవుతారా? లేదా రిటైర్మెంట్ తీసుకుంటారా? అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. అదే టైమ్‌లో కోచ్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసిపోవడంతో ఆయన్ను కంటిన్యూ చేస్తారా? రాహుల్ ప్లేస్‌లో వీవీఎస్ లక్ష్మణ్ లేదా వేరొకర్ని ఆ పోస్టుకు రీప్లేస్ చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఎట్టకేలకు వీటిపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) క్లారిటీ ఇచ్చింది.
కొన్నాళ్లుగా ఎంతో ఉత్కంఠ రేపిన టీమిండియా హెడ్ కోచ్ పదవిపై స్పష్టత వచ్చేసింది. ప్రధాన కోచ్‌గా కంటిన్యూ అయ్యేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. దీన్ని బీసీసీఐ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ద్రవిడ్‌తో పాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బోర్డు పొడిగించింది. దీంతో బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌కు ఎక్స్టెన్షన్ లభించినట్లయింది. అయితే వీళ్లంతా ఎప్పటిదాకా ఆ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్నాయి.
ఇక, కోచ్‌గా కంటిన్యూ అయ్యేందుకు మొదట ఇంట్రెస్ట్ చూపని ద్రవిడ్.. ఆఖరికి అంగీకరించాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. గత రెండేళ్లుగా భారత టీమ్‌తో ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించిందన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశామని.. మేనేజ్మెంట్తో పాటు టీమ్ నుంచి ఎంతో సపోర్ట్ దొరికిందన్నాడు. టీమిండియాలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారని.. తామంతా సరైన దారిలోనే ఉన్నామన్నారు. తన మీద నమ్మకం ఉంచి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమ్‌గా చాలా ఛాలెంజెస్ను ఎదుర్కొన్నామని.. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డామని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం పలుమార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేదన్నాడు.
కుటుంబ సభ్యుల మద్దతును మర్చిపోలేనని.. తన కోసం వాళ్లు చాలా త్యాగాలు చేశారని చెబుతూ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌ను కంటిన్యూ చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంచి టీమ్‌ను సెట్ చేశారని.. వన్డే వరల్డ్ కప్ మిస్సయినా టీ20ల్లో కప్పు కొడతామని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ద్రవిడ్ కాంట్రాక్ట్ కొనసాగింపుపై టీమిండియా మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ రియాక్ట్ అయ్యాడు. ‘ద్రవిడ్‌ను కొనసాగించాలనేది మంచి నిర్ణయం. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున సపోర్ట్ స్టాఫ్‌ను మార్చలేం. హెడ్ కోచ్‌గా కంటిన్యూ అయ్యేందుకు రాహుల్ ఒప్పుకోవడం మంచి విషయం. మనం ఇదే తరహాలో డామినేట్ చేస్తూ ఆడతామని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. ద్రవిడ్ కొనసాగింపుపై గౌతీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నితిన్‌కు ధోని సర్ప్రైజ్ గిఫ్ట్! ఏం ఇచ్చాడంటే..?
#WATCH | On extension for Rahul Dravid as head coach of Team India, former cricketer Gautam Gambhir says,” It’s a good thing because the T20 World Cup is around the corner and you don’t want to change the entire support staff, and it is good that Rahul has accepted it..… pic.twitter.com/R3DAcpOJNg
— ANI (@ANI) November 29, 2023