National T20 Cup: విచిత్రమైన ఔట్.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 02:44 PM, Tue - 5 December 23

పాకిస్థాన్ నేషనల్ టీ20 కప్ లో ఓ ప్లేయర్ విచిత్రంగా అవుటై పెవిలియన్ చేరాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్థాన్ నేషనల్ టీ20 కప్ లో ఓ ప్లేయర్ విచిత్రంగా అవుటై పెవిలియన్ చేరాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 02:44 PM, Tue - 5 December 23

క్రికెట్ లో ఆటగాళ్లు చిత్ర విచిత్రంగా అవుట్ అవుతూ ఉంటారు. ఇక ఈ సంఘటనలు చూస్తే.. మనం ఆశ్చర్యపోక తప్పదు. ఒక్కోసారి నవ్వుకూడా వస్తుంది. తాజాగా పాకిస్థాన్ నేషనల్ టీ20 కప్ లో ఓ ప్లేయర్ విచిత్రంగా అవుటై పెవిలియన్ చేరాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో, నీ అంత దురదృష్టవంతుడు ఈ లోకంలోనే ఉండడు అనుకుంటా. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ విచిత్ర అవుట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

క్యాచ్ అవుట్, స్టంపౌట్, రనౌట్, హిట్ వికెట్ ఇలా రకరకాల అవుట్ ల గురించి మనకు తెలిసిందే. ఇక ఇందులోనే బ్యాటర్లు చిత్ర విచిత్రంగా అవుటై పెవిలియన్ కు చేరుతూ ఉంటారు. తాజాగా క్రికెట్ ప్రపంచంలో ఓ విచిత్రమైన ఔట్ నమోదు అయ్యింది. పాకిస్థాన్ నేషనల్ టీ20 కప్ లో భాగంగా అబోటాబాద్-సియాల్ కోట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సియాల్ కోట్ ఓపెనర్, పాక్ యంగ్ ప్లేయర్ మీర్జా తాహిర్ ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్ లో అతడు ఎవరూ ఊహించని విధంగా హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్ యాసిర్ షా ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేయడానికి వచ్చాడు.

ఈ క్రమంలో క్రీజ్ లో ఉన్నాడు తాహిర్. యాసిర్ షా వేసిన బంతిని బ్యాక్ ఫుట్ నుంచి ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బాల్ ను వెనక్కి వెళ్లి బలంగా కొట్టడంతో అతడి బరువు మెుత్తం బ్యాక్ ఫుట్ పై పడింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన అతడు స్టంప్స్ పై పడిపోయాడు. కుడి కాలి కండరాలు పట్టేయడంతో.. అతడు బ్యాలెన్స్ కోల్పోయాడు. నొప్పితో క్రీజ్ లోనే పడి విలవిల్లాడు. ఇక ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 38 రన్స్ చేసి హిట్ వికెట్ గా నిరాశగా గ్రౌండ్ ను వీడాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వికెట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడి దురదృష్టానికి చింతిస్తున్నారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సియాల్ కోట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 119 పరుగులు చేసింది. అనంతరం 120 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన అబోటాబాద్ టీమ్ 17.4 ఓవర్లలో ఛేదించింది. మరి ఈ విచిత్రమైన అవుట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments