ప్లే ఆఫ్స్‌ చేరిన 4 టీమ్స్‌లో RCBకే ధోని మద్దతు! కోహ్లీపై ప్రేమను బయటపెట్టిన ధోని!

MS Dhoni, Virat Kohli, RCB, IPL 2024: ఐపీఎల్‌ 2024లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో.. ధోని తన మద్దుతు ఏ టీమ్‌కో చెప్పేశాడు. ధోని మద్దతు ఇచ్చాడు కాబట్టి ఆర్సీబీ కప్పు కొడుతుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఆర్సీబీకి ధోని మద్దతుపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

MS Dhoni, Virat Kohli, RCB, IPL 2024: ఐపీఎల్‌ 2024లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో.. ధోని తన మద్దుతు ఏ టీమ్‌కో చెప్పేశాడు. ధోని మద్దతు ఇచ్చాడు కాబట్టి ఆర్సీబీ కప్పు కొడుతుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఆర్సీబీకి ధోని మద్దతుపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులను ఎవర్ని కదిలించినా ఒకటే చర్చ.. ఈ సారి కప్పు కొట్టేది ఎవరు? ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు టీమ్స్‌.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో ఏ జట్టు కప్పు కొడుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు క్రికెట్‌ అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్‌ కప్పు కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ తర్వాత.. ఆర్సీబీకే తెలుగు ఫ్యాన్స్‌ మద్దుతు లభిస్తోంది. అయితే.. దిగ్గజ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సైతం తన మద్దతు ఎవరికో చెప్పేశాడు. ఈ సారి ఆర్సీబీ కప్పు కొట్టాలని కోరుకుంటున్నట్లు ధోని తన మనసులో మాట బయటపెట్టేశాడు.

ధోని-కోహ్లీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ధోనిని పెద్దన్నగా భావిస్తాడు కోహ్లీ. టీమిండియాలో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత ధోని వారసుడిగా ఎదిగి.. ధోని అండదండలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ధోని తర్వాత అంతే సమర్థవంతంగా భారత జట్టును నడిపించాడు. ఐసీసీ ట్రోఫీలు గెలవకపోయినా.. కోహ్లీ కూడా గొప్ప కెప్టెన్‌గా ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే.. ఐపీఎల్‌లో కూడా కోహ్లీ ఖాతాలో కప్పు లేదు. ఐపీఎల్‌ ట్రోఫీ కోసం ఏకంగా 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు కోహ్లీ. ఈ సారి అయితే.. ఆ పోరాటం పీక్స్‌కు చేరిందనే చెప్పాలి.

తొలి 8 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 7 మ్యాచ్‌లు ఓడిపోయింది. అందులో కూడా వరుసగా ఆరు ఓటములు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. ఆర్సీబీ వరుసగా ఆరు సంచలన విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరింది. అందులోనూ.. చెన్నైతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో తమకు కావాల్సిన మార్జిన్‌తో గెలిచింది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌ విజయంతో తాము ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంతో పాటు.. సీఎస్‌కేను ఇంటికి పంపింది. అయితే.. ధోనికి ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో.. సీఎస్‌కేతో మ్యాచ్‌ తర్వాత కోహ్లీ.. సీఎస్‌కే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ధోనిని కలిశాడు. ఈ సందర్భంగా ‘విరాట్ నువ్వు ఫైనల్ కు చేరాలి, కప్ కొట్టాలి, గుడ్ లక్’ అంటూ కోహ్లీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. కోహ్లీ కప్పు కొట్టాలంటే.. ఆర్సీబీ కప్పు కొట్టాలి అని ధోని చెప్పకనే చెప్పేశాడంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments