T20 World Cup: హార్దిక్ పాండ్యా కెరీర్ పై కీలక నిర్ణయం!.. ఇక అంతా రోహిత్ చేతుల్లోనే

రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లు కలిసి ఇటీవలే ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పాండ్యా భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లు కలిసి ఇటీవలే ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పాండ్యా భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం ఐపీఎల్ తో పాటుగా టీమిండియా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ గా ఎన్నికైన దగ్గర నుంచి పాండ్యా చుట్టూ వివాదాలు, విమర్శలే. దీనికి తోడు టోర్నీలో వరుసగా హ్యాట్రిక్ ఓటములు. అన్నీ కలిసి పాండ్యాను మానసికంగా కుంగదీశాయి. ఇలాంటి టైమ్ లో రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లు కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పాండ్యా భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ.. దాని వెనకాల మెయిన్ టార్గెట్ మాత్రం టీ20 ప్రపంచ కప్పే ఉంది. ఇక ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో రాణించి.. పొట్టి ప్రపంచ కప్ జట్టులో చోటు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెలెక్టర్లతో కలిసి ముంబైలో ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో హార్దిక్ పాండ్యా కెరీర్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మీటింగ్ లో ఏం చర్చించారు అంటే?

టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో బీసీసీఐ తన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా రోహిత్, ద్రవిడ్, సెలెక్టర్లతో కలిసి ఓ సమావేశాన్ని ముంబైలో నిర్వహించింది. ఇందులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా విషయం చర్చకు వచ్చినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. పాండ్యాను రెగ్యూలర్ బౌలర్ గా వినియోగించుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం పార్ట్ టైమ్ బౌలర్ గా సేవలు అందిస్తున్న పాండ్యాను ఇక నుంచి ఫుల్ టైమ్ బౌలర్ గా వాడుకోవాలని చూస్తోంది. సమావేశంలో ఇదే కీలక నిర్ణయంగా తీసుకున్నాట్లు సమాచారం. పొట్టి ప్రపంచ కప్ లో ఆల్ రౌండర్లు ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో పాండ్యా సేవలను ఈ విధంగా ఉపయోగించుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments