Nidhan
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తోటి ఆటగాళ్లు అని కూడా చూడకుండా హార్దిక్, గిల్ మీద అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తోటి ఆటగాళ్లు అని కూడా చూడకుండా హార్దిక్, గిల్ మీద అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Nidhan
ఐపీఎల్-2024కు మరికొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి నెల మూడో వారంలో క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ షురూ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది వేసవిలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ తర్జనభర్జనలు పడుతోంది. దీంతో అసలు ఈసారి ఐపీఎల్‌ను మన దేశంలో నిర్వహిస్తారా లేదా ఇతర దేశానికి తరలిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. అటు క్రికెటర్లు అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఎంఎస్ ధోనీతో పాటు గాయాల నుంచి కోలుకుంటున్న మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశారు. ఈ తరుణంలో షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ పాండ్యా వీడటం మీద అతడు రియాక్ట్ అయ్యాడు. పాండ్యా పోయినా ఎవరికీ నష్టం లేదన్నాడు.
హార్దిక్ వెళ్లిపోయినా నష్టం లేదని చెప్పిన షమి.. శుబ్‌మన్ గిల్ టీమ్‌ను వీడినా పోయేదేమీ లేదన్నాడు. టీమ్ సమతూకంతో ఉందా? లేదా? అనేదే మాత్రమే చూడాల్సిన అంశమన్నాడు. ‘ఎవరు జట్టులో నుంచి వెళ్లిపోయినా పెద్దగా ఫరక్ పడదు. టీమ్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్. హార్దిక్ ఒకప్పుడు కెప్టెన్‌గా ఉన్నాడు. మమ్మల్ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపించాడు. రెండు సీజన్లలో టీమ్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఒకసారి గెలిపించాడు కూడా.. అయినా పాండ్యాతో లైఫ్ టైమ్‌కు సరిపడా గుజరాత్ టైటాన్స్ అగ్రిమెంట్ చేసుకోలేదు కదా! టీమ్‌తో ఉండాలా, వీడాలా అనేది అతడి డెసిజన్. ఇప్పుడు గిల్ సారథి అయ్యాడు. కెప్టెన్‌గా తనకూ ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఏదో ఒక రోజు శుబ్‌మన్ కూడా జట్టును వదిలి వెళ్లే ఛాన్స్ ఉంది’ అని షమి చెప్పుకొచ్చాడు.
ఫ్రాంచైజీ క్రికెట్లో లాయల్టీకి చోటు లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు షమి. గేమ్‌లో ఇవన్నీ కామన్ అని తెలిపాడు. ప్లేయర్లు వస్తుంటారు.. పోతుంటారని పేర్కొన్నాడు. వచ్చే సీజన్లో గిల్ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా తన రెస్పాన్సిబిలిటీని సక్రమంగా నెరవేరుస్తాడనే నమ్మకం ఉందన్నాడు. ప్లేయర్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన రాబట్టగలిగితే సారథి పని సులువవుతుందని షమి వివరించాడు. అయితే గిల్, హార్దిక్‌ను ఉద్దేశించి షమి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడ్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు ఇంత బోల్డ్‌గా మాట్లాడటం ఏందని అంటున్నారు. షమి చెప్పిన దాంట్లో తప్పు లేదని.. ఫ్రాంచైజీ క్రికెట్ ఇలాగే ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫలానా ప్లేయర్ ఫలానా టీమ్‌కే ఎప్పటికీ ఆడుతూ ఉండాలంటే కుదరని పని అని చెబుతున్నారు. మరి.. షమి వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Gautam Gambhir: వీడియో: మోదీ పిలుపుతో ఆలయాన్ని శుభ్రం చేసిన టీమిండియా క్రికెటర్
Mohammed Shami reacts to Hardik Pandya leaving Gujarat Titans 😂 pic.twitter.com/lBALRQmI3y
— Sameer Allana (@HitmanCricket) January 16, 2024