IND vs ENG: వేట మొదలుపెట్టిన భారత్.. ఇంగ్లండ్​ బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయిస్తున్నారు!

భారత్ జట్టు వేట మొదలుపెట్టింది. బజ్​బాల్​ అంటూ బీరాలు పోయిన ఇంగ్లండ్​తో చెడుగుడు ఆడుకుంటోంది. ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లీష్ బ్యాటర్లకు మన బౌలర్లు ఓ రేంజ్​లో పోయిస్తున్నారు.

భారత్ జట్టు వేట మొదలుపెట్టింది. బజ్​బాల్​ అంటూ బీరాలు పోయిన ఇంగ్లండ్​తో చెడుగుడు ఆడుకుంటోంది. ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లీష్ బ్యాటర్లకు మన బౌలర్లు ఓ రేంజ్​లో పోయిస్తున్నారు.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్​లోని తొలి మ్యాచ్ మొదలైంది. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్​ను ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లే తొలి అర్ధగంటలో ఆ జట్టు బ్యాటర్లు బాగా బ్యాటింగ్ చేశారు. కానీ స్పిన్నర్లు వచ్చినప్పటి నుంచి మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. బజ్​బాల్​తో టీమిండియాను దెబ్బతీస్తామని బీరాలు పోయిన ఇంగ్లండ్ జట్టును అదే ఫార్ములాతో చెడుగుడు ఆడుకుంటోంది రోహిత్ సేన. అగ్రెసివ్ బ్యాటింగ్​ అప్రోచ్​తో భారత్​ను భయపెడదామని అనుకుంది ఇంగ్లండ్. కానీ స్పిన్ అస్త్రాన్ని ఎదుర్కోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 55 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా స్ట్రాంగ్​గా కనిపించిన పర్యాటక జట్టు.. ఆ తర్వాత 5 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోయింది.

తొలి టెస్ట్​లో ఇంగ్లండ్​కు టీమిండియా బౌలర్లు ఒక రేంజ్​లో పోయిస్తున్నారు. వికెట్‌ తర్వాత వికెట్ తీస్తూ అపోజిషన్ టీమ్​ను పూర్తిగా డిఫెన్స్​లో పడేశారు. పేసర్లును బాగా ఎదుర్కొన్న పర్యాటక జట్టు మంచి రన్​రేట్​తో బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. దీంతో నిజంగానే బజ్​బాల్ ఫార్ములా వర్కౌట్ అవుతోందని అంతా అనుకున్నారు. కానీ స్పిన్నర్ల రాకతో అది అస్సలు పని చేయదని తేలిపోయింది. రవీంద్ర జడేజా ఒకే లైన్​ను పట్టుకొని కట్టుదిట్టంగా బంతులు వేయగా.. అశ్విన్ వెరైటీ డెలివరీస్​తో బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. బెన్ డకెట్ (35)ను తొలుత అశ్విన్ వెనక్కి పంపాడు. అనంతరం ఓలీ పోప్​ (1)కు జడ్డూ పెవిలియన్​ దారి చూపించాడు. ఆ తర్వాత సిరాజ్ పట్టిన అద్భుతమైన లో క్యాచ్​తో క్రాలేను డిస్మిస్ చేశాడు అశ్విన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్​ను చూస్తుంటే 180 పరుగుల్లోపే ఇంగ్లీష్ టీమ్​ను భారత్ ఆలౌట్ చేస్తుందనిపిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 18 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 74 పరుగులతో ఉంది. సీనియర్ బ్యాటర్లు జో రూట్ (3 నాటౌట్), జానీ బెయిర్​స్టో (13 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​ను ఎంత స్కోరుకు భారత్ ఆలౌట్ చేస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments