Rohit Sharma: వీడియో: టీమ్​మేట్స్​ను ఇమిటేట్ చేసిన రోహిత్.. బుమ్రా, కోహ్లీని అచ్చం దింపేశాడు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​తో పాటు బయట కూడా ఎంతో సరదాగా ఉంటాడు. టీమ్​మేట్స్​ను ఆటపట్టిస్తూ, జోకులు వేస్తుంటాడు. ఈ క్రమంలో జట్టులోని కొందరు స్టార్లను అతడు ఇమిటేట్ చేశాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​తో పాటు బయట కూడా ఎంతో సరదాగా ఉంటాడు. టీమ్​మేట్స్​ను ఆటపట్టిస్తూ, జోకులు వేస్తుంటాడు. ఈ క్రమంలో జట్టులోని కొందరు స్టార్లను అతడు ఇమిటేట్ చేశాడు.

క్రికెట్​లో కెప్టెన్​కు ఉండే బాధ్యతలు, అతడి మీద ఉండే ఒత్తిడి గురించి తెలిసిందే. క్రికెట్ అనే కాదు.. ఏ గేమ్​లోనైనా సారథి అంటే ఇలాగే ఉంటుంది. జట్టు గెలిచినా, ఓడినా అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. గెలిపిస్తే అతడ్ని పొగుడుతారు.. ఓడితే తిట్ల దండకం అందుకుంటారు. అందుకే కెప్టెన్సీ చేస్తున్న వాళ్లు మ్యాచ్​లో చాలా ఫోకస్డ్​గా ఉంటారు. టీమ్ సెలక్షన్ నుంచి మ్యాచ్​లోని ప్రతి నిర్ణయం విషయంలోనూ ఎంతో కచ్చితత్వంతో వ్యవహరిస్తారు. కానీ కొందరు కెప్టెన్లు మాత్రం కూల్​గా, సదరాగా ఉంటారు. జట్టు ప్లేయర్లతో కలసిపోయి ఫన్నీగా ఉంటూ ఎలాంటి సిచ్యువేషన్​ను అయినా కూల్​గా డీల్ చేస్తారు. అలాంటి వారిలో ఒకడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రౌండ్​లో ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ కనిపిస్తుంటాడు హిట్​మ్యాన్. అలాంటి అతడు టీమ్​మేట్స్​ను ఇమిటేట్ చేశాడు. ముఖ్యంగా కోహ్లీ, బుమ్రాను పర్ఫెక్ట్​గా దించేశాడు.

కొన్ని సమయాల్లో తప్పితే గ్రౌండ్​లో రోహిత్ ఎక్కువగా నవ్వుతూనే కనిపిస్తాడు. టీమ్​మేట్స్​తో కలసి జోవియల్​గా ఉంటాడు. జట్టు ఆటగాళ్లతోనే కాదు.. అంపైర్లతో కూడా ఫన్నీగా ఉంటాడు. అలాంటి హిట్​మ్యాన్ టీమ్​మేట్స్​ను ఇమిటేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, శుబ్​మన్ గిల్​​తో పాటు లెజెండరీ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్​ను కూడా అతడు ఇమిటేట్ చేశాడు. ధోని హెలికాప్టర్ షాట్, సచిన్ అప్పర్ కట్​, సూర్య సుప్లా షాట్ ఎలా కొడతారో చేసి చూపించాడు. అయితే వీటన్నింటి కంటే కోహ్లీ సెలబ్రేషన్స్, బుమ్రా బౌలింగ్ యాక్షన్​ను హిట్​మ్యాన్ ఇమిటేట్ చేసింది మాత్రం హైలైట్ అనే చెప్పాలి. ఎగ్జాగ్ట్​గా ఇద్దర్నీ దించేశాడు. సెలబ్రేషన్స్ టైమ్​లో విరాట్ ఎలా అరుస్తాడో చూపించాడు. ఇది చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు. ప్రస్తుతం హిట్​మ్యాన్ ఇమిటేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

రోహిత్ ఇమిటేషన్ వీడియో చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ, బుమ్రాను అతడు అచ్చం దింపేశాడని అంటున్నారు. హిట్​మ్యాన్​ అబ్జర్వేషన్ సూపర్బ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఇంగ్లండ్​తో తొలి టెస్ట్​కు ముందు హైదరాబాద్​లో బీసీసీఐ నమన్ అవార్డ్స్-2024 కార్యక్రమం నిర్వహించింది. ఆ ఈవెంట్​లో పాల్గొన్న సమయంలో టీమ్​మేట్స్​ను ఇమిటేట్ చేయమని యాంకర్ అడిగినప్పుడు రోహిత్ తోటి ఆటగాళ్లను దించేశాడు. కాగా, నమన్ అవార్డ్స్​లో రోహిత్, కోహ్లీకి ఒక్క పురస్కారం కూడా దక్కలేదు. 2019-20 ఏడాదికి గానూ పేసర్ మహ్మద్ షమి బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్​గా నిలిచాడు. 2020-21కి గానూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది బుమ్రా, 2022-23కు గానూ గిల్ ఆ అవార్డును గెలుచుకున్నారు. మరి.. రోహిత్ ఇమిటేషన్​ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments