Jasprit Bumrah: ఓటమి బాధలో బుమ్రా.. పేసుగుర్రానికి షాకిచ్చిన ICC

ఉప్పల్ టెస్ట్​లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్​ను చేజేతులా వదులుకున్నారని అంటున్నారు. అయితే ఎంత బాగా బౌలింగ్ చేసినా ఓటమి తప్పకపోవడంతో పేసర్ జస్​ప్రీత్ బుమ్రా కూడా బాధలో ఉన్నాడు. ఈ తరుణంలో అతడికి ఐసీసీ షాక్‌ ఇచ్చింది.

ఉప్పల్ టెస్ట్​లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్​ను చేజేతులా వదులుకున్నారని అంటున్నారు. అయితే ఎంత బాగా బౌలింగ్ చేసినా ఓటమి తప్పకపోవడంతో పేసర్ జస్​ప్రీత్ బుమ్రా కూడా బాధలో ఉన్నాడు. ఈ తరుణంలో అతడికి ఐసీసీ షాక్‌ ఇచ్చింది.

ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​ను టీమిండియా ఇంత పేలవంగా స్టార్ట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంగ్లీష్ టీమ్​ను ఈజీగా చిత్తు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా తొలి టెస్ట్​లో ఓడిపోయింది రోహిత్ సేన. రెండున్నర రోజుల వరకు గేమ్​లో భారత్​దే డామినేషన్ నడిచింది. కానీ ఇంగ్లండ్​ను సెకండ్ ఇన్నింగ్స్​లో భారీ స్కోరు చేయకుండా మన బౌలర్లు అడ్డుకోలేకపోయారు. 5 వికెట్లు త్వరగా పడగొట్టినా ఆ తర్వాత ఓలీ పాప్ (196)ను ఆపడంలో ఫెయిలయ్యారు. అతడు లోయరార్డర్​ అండతో టీమిండియా ముందు భారీ టార్గెట్​ను సెట్ చేశాడు. మన బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. 230 పరుగుల ఛేదనలో ఏ దశలోనూ టార్గెట్​ను అందుకునేలా రోహిత్ సేన కనిపించలేదు. చివరికి 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ బాధతో అటు అభిమానులే కాదు.. జట్టులోని ఆటగాళ్లు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టైమ్​లో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు ఐసీసీ షాక్ ఇచ్చింది.

మొదటి టెస్టులో ఓటమితో బాధలో ఉన్న బుమ్రాకు గట్టి షాక్ తగిలింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్​ను అధిగమించినందుకు గానూ అతడి మీద ఒక డీమెరిట్ పాయింట్ వేశారు. సెకండ్ ఇన్నింగ్స్​లో 81వ ఓవర్​లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పాప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. బుమ్రా బౌలింగ్​లో షాట్ కొట్టాక రన్ కోసం నాన్​స్ట్రయికింగ్ ఎండ్​ వైపు వచ్చాడు పాప్. కానీ అతడు పరిగెత్తుకుంటూ వస్తున్న రూట్​లో నిల్చున్న భారత స్టార్ పేసర్ ఇంగ్లీష్ బ్యాటర్​ను తన భుజంతో ఢీకొట్టాడు. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఐసీసీ 2.12 కోడ్ ఆఫ్ కండక్ట్​ను అధిగమించినందుకు గానూ బుమ్రాకు 1 డీమెరిట్ పాయింట్ విధించారు. గత రెండేళ్లలో అతడి మీద ఇలా డీమెరిట్ పాయింట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆన్​ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, క్రిస్ గెఫెనీతో పాటు థర్డ్ అంపైర్లు మరాయిస్ ఎరాస్మస్, ఫోర్త్ అంపైర్ రోహన్ పండిత్​తో చర్చించిన తర్వాత రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐసీసీ లెవల్ 1 రూల్​ను అధిగమిస్తే మ్యాచ్​ ఫీజులో 50 శాతం కోత విధించే అవకాశం ఉంటుంది లేకపోతే 2 డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. అయితే ఈ ఘటనపై జరిపిన విచారణలో బుమ్రా తన తప్పును ఒప్పుకున్నాడు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్​సన్ ముందు బుమ్రా తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. దీంతో శిక్షను ఒక డీమెరిట్ పాయింట్​తో సరిపెట్టారు. కాగా, తొలి టెస్ట్​లో బుమ్రా బాగా బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్​లో 8.3 ఓవర్లు బౌలింగ్ చేసిన పేసుగుర్రం.. 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో ఒక మెయిడిన్ ఉంది. రెండో ఇన్నింగ్స్​లో 16.1 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్స్ బెన్ డకెట్​తో పాటు జో రూట్​ను అతడు వెనక్కి పంపాడు. 196 రన్స్​తో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఓలీ పాప్​నూ అతడే పెవిలియన్​కు చేర్చాడు. అయితే అప్పటికే చేయాల్సిన పనిని పూర్తి చేశాడు పాప్. బుమ్రాకు తోడుగా మిగతా బౌలర్లు కూడా రాణించి ఉంటే ఈ మ్యాచ్​లో భారత్ పరిస్థితి మరోలా ఉండేది. మరి.. బాధలో ఉన్న బుమ్రాను మరింత ఇబ్బంది పెడుతూ ఐసీసీ డీమెరిట్ పాయింట్ విధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments