IND vs ENG: తొలి టెస్ట్​కు ముందు ఇంగ్లండ్​కు షాక్.. లాస్ట్ మూమెంట్​లో కోలుకోలేని దెబ్బ!

టీమిండియాతో తొలి టెస్ట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్​కు షాక్. లాస్ట్ మూమెంట్​లో ఆ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

టీమిండియాతో తొలి టెస్ట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్​కు షాక్. లాస్ట్ మూమెంట్​లో ఆ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

భారత్-ఇంగ్లండ్ జట్లు తొలి టెస్ట్​కు సిద్ధమవుతున్నాయి. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​ గురువారం మొదలుకానుంది. దీంతో రెండు టీమ్స్ ప్లేయర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్​కు చేరాలంటే గెలుపు కీలకంగా మారడంతో సిరీస్​ను పట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉప్పల్​ టెస్ట్​కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బజ్​బాల్ ఫార్ములాతోనే ముందుకు వెళ్తామని చెబుతూ వస్తున్న ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్​లోనే దాని రుచి ఏంటో భారత్​కు చూపించాని భావిస్తోంది. టీమిండియా మాత్రం తమదైన శైలిలోనే ఆడుతూ పర్యాటక జట్టును చిత్తు చేయాలని చూస్తోంది. ఉప్పల్​ గ్రౌండ్​లో సూపర్బ్ రికార్డు ఉండటం రోహిత్ సేనకు కలిసొచ్చే అంశం. ఈ తరుణంలో ఇంగ్లండ్​​కు భారీ షాక్. లాస్ట్ మూమెంట్​లో ఆ టీమ్​కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

ఇంగ్లండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఉప్పల్ టెస్ట్​కు దూరమయ్యాడు. భారత్​తో ఐదు టెస్టులకు ఎంపికైన జట్టులో అతడు కూడా ఉన్నాడు. ఈపాటికే అతడు ఇండియాకు రావాల్సింది. కానీ వీసా ఇష్యూ కారణంగా రాలేదు. వీసా సమస్య ఇంకా కొలిక్కి రాకపోవడంతో తొలి టెస్ట్​కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది ఇంగ్లండ్​కు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. బషీర్ స్టార్ బౌలర్ కాదు, ఒక్క టెస్ట్ ఆడిన అనుభవం కూడా అతడికి లేదు. అలాంటప్పుడు ఇంగ్లీష్ టీమ్​కు పోయేది ఏముందని అనుకోవద్దు. భారత వికెట్లు టర్నింగ్ ట్రాక్స్ అనేది తెలిసిందే. ఇంగ్లండ్​ బజ్​బాల్​తో టీమిండియాను చిత్తు చేయాలని అనుకుంటోంది. భారత్ స్పిన్ అస్త్రంతో పర్యాటక జట్టును మట్టికరిపించాలని ఎత్తుగడ వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ టీమ్ కూడా ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాను ప్రయోగించాలని అనుకుంటోందని తెలిసింది.

టీమ్​లో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలనుకుంటే బషీర్​ను ఆడించాల్సిందే. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ రూపంలో ఆల్రెడీ ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. బషీర్​ మూడో స్పిన్నర్​గా ఆడేవాడు. కానీ వీషా ఇష్యూ వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో ఇంగ్లీష్ టీమ్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. జో రూట్ రూపంలో ఓ స్పిన్నర్ ఉన్నా అతడు స్పెషలిస్ట్ స్పిన్నర్ కాదు. ఒకవేళ ఉప్పల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం ఆ జట్టుకు దబిడిదిబిడే. ఈ నేపథ్యంలో బషీర్ లేని లోటును ఆ జట్టు ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. ఇక, రేపటి మ్యాచ్​లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్​ను చూసుకుంటే.. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓలీ పోప్ ఫస్ట్ డౌన్​లో, జో రూట్ సెకండ్ డౌన్​లో దిగుతారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ మిడిలార్డర్ భారాన్ని మోస్తాడు. అతడి తర్వాత జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్) బ్యాటింగ్​కు వస్తాడు. బెన్ ఫోక్స్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. రెహాన్ అహ్మద్, జాక్ లీచ్ స్పిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మ్యాచ్​కు ముందు తుది జట్టులో ఇంకేమైనా మార్పులు చేస్తే తప్ప దాదాపుగా బరిలోకి దిగే టీమ్ ఇదే. మరి.. తొలి టెస్ట్​కు ముందు ఇంగ్లండ్​కు బిగ్ షాక్ తగలడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments