Yashasvi Jaiswal Ruturaj Gaikwad Run Out: వీడియో: జైస్వాల్ స్వార్థానికి బలిపశువుగా మారిన రుతురాజ్!

వీడియో: జైస్వాల్ స్వార్థానికి బలిపశువుగా మారిన రుతురాజ్!

  • Author singhj Published - 10:10 AM, Fri - 24 November 23

టీమిండియా యంగ్ ఓపెనర్​ యశస్వి జైస్వాల్ చేసిన ఓ పని వల్ల మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బలయ్యాడు. దీంతో అభిమానులు జైస్వాల్​ను ట్రోల్ చేస్తున్నారు.

టీమిండియా యంగ్ ఓపెనర్​ యశస్వి జైస్వాల్ చేసిన ఓ పని వల్ల మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బలయ్యాడు. దీంతో అభిమానులు జైస్వాల్​ను ట్రోల్ చేస్తున్నారు.

  • Author singhj Published - 10:10 AM, Fri - 24 November 23

వరల్డ్ కప్-2023 ఫైనల్​లో జరిగిన గాయం నుంచి ఇంకా భారత అభిమానులు కోలుకోలేదు. అటు ప్లేయర్లు కూడా ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్​లో మొదలైపోయింది. మరో 7 నెలల్లో పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ ఉండటంతో అంతా కొత్తగా ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది. ఫైనల్​లో ఓడిన టీమిండియాతో పాటు గెలిచిన ఆసీస్​కు కూడా టీ20 వరల్డ్ కప్ జర్నీని మొదలుపెట్టాల్సిన తరుణం వచ్చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య నిన్న వైజాగ్​లో ఫస్ట్ టీ20 జరిగింది. మెగా టోర్నీ ఫైనల్లో నిరాశపర్చిన సూర్యకుమార్ యాదవ్.. ఈసారి మాత్రం కంగారూలను వదల్లేదు. రివేంజ్ తీర్చుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్​లో టాస్ ఓడిన ఆస్ట్రేలియాను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు కెప్టెన్ సూర్యకుమార్. ఆ జట్టు 20 ఓవర్లు ఆడి 3 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీ హీరో జోష్ ఇంగ్లిస్​ (110)కు తోడు స్టీవ్ స్మిత్ (52) కూడా అద్భుతంగా ఆడటంతో భారత్ ముందు భారీ టార్గెట్​ను ఉంచింది ఆసీస్. టీ20ల్లో ఇంతవరకు ఇంత భారీ లక్ష్యాన్ని టీమిండియా ఎప్పుడూ ఛేదించలేదు. ఛేజింగ్​లో 22 రన్స్​కే ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. దీంతో మరోమారు కంగారూల చేతుల్లో ఓటమి తప్పదని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ (80) మాత్రం పట్టు వదల్లేదు. ఇషాన్ కిషన్ (58) తోడుగా ప్రత్యర్థి బౌలర్లపై అటాక్​కు దిగాడు. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్సులతో విజృంభించడంతో స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది.

విజయానికి చేరువలో సూర్య, ఇషాన్ ఔటైనా రింకూ సింగ్ (22 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశాడు. ఒక టైమ్​లో మ్యాచ్ మన చేతి నుంచి జారిపోతున్నట్లు అనిపించింది. చెత్త షాట్ ఆడి అక్షర్ పటేల్ ఔటవ్వడం, అతడి తర్వాత వచ్చిన రవి బిష్ణోయ్, అక్షర్​దీప్ సింగ్​లు రనౌట్లుగా వెనుదిరగడంతో టెన్షన్ మొదలైంది. కానీ స్ట్రయిక్​లోకి వచ్చిన రింకూ కూల్​గా సిక్స్ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. గెలిచిన తర్వాత కూడా తన స్టైల్​లో జస్ట్ చేతులు అలా పైకి పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్​లో జరిగిన ఓ ఘటనతో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విలన్​గా మారాడు. రుతురాజ్​ గైక్వాడ్​తో కలసి ఓపెనింగ్​ చేశాడు జైస్వాల్.

ఇన్నింగ్స్ మొదటి ఓవర్​లోనే రుతురాజ్ వికెట్​ను భారత్ కోల్పోయింది. జైస్వాల్​తో సమన్వయ లోపం కారణంగా గైక్వాడ్ డైమండ్ డకౌట్​గా వెనుదిరిగాడు. అయితే ఇందులో అతడి తప్పు లేదు. జైస్వాల్ రన్​కు పిలిస్తేనే అతడు వెళ్లాడు. కానీ డెసిజన్ మార్చుకున్న అతను రుతురాజ్​ను వెనక్కి వెళ్లిపోమన్నాడు. అప్పటికే సగం క్రీజులోకి వచ్చేయడంతో తిరిగి వెళ్లేసరికి రనౌట్ అయ్యాడు. దీంతో బాధతో తల దించుకొని మౌనంగా వెళ్లిపోయాడు రుతురాజ్. ఫ్యాన్స్ జైస్వాల్​ను ఓ రేంజ్​లో ట్రోల్ చేస్తున్నారు. అతడు తన స్వార్థం కోసం రుతురాజ్​ను బలిపశువును చేశాడంటున్నారు. కర్మ ఎవ్వర్నీ వదలదని.. గైక్వాడ్​ను ఔట్ చేయించిన కాసేపటికే జైస్వాల్​ పెవిలియన్​కు చేరడమే దీనికి ఎగ్జాంపుల్ అని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రికార్డుల కోసం స్వార్థం చూసుకోకుండా టీమ్ గెలుపు కోసం ఆడు జైస్వాల్ అంటూ సూచిస్తున్నారు. మరి.. జైస్వాల్-రుతురాజ్ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్​తో ఫస్ట్ టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

Show comments