IND vs AUS Suryakumar Facing Issues: తొలి టీ20లో గెలిచినా టీమిండియాను వదలని సమస్యలు.. సూర్య ఏం చేస్తాడో..?

తొలి టీ20లో గెలిచినా టీమిండియాను వదలని సమస్యలు.. సూర్య ఏం చేస్తాడో..?

  • Author singhj Published - 05:03 PM, Fri - 24 November 23

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచినా టీమిండియాను కొన్ని సమస్యలు వదలడం లేదు. దీంతో ఈ ప్రాబ్లమ్స్​ను సూర్య ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచినా టీమిండియాను కొన్ని సమస్యలు వదలడం లేదు. దీంతో ఈ ప్రాబ్లమ్స్​ను సూర్య ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

  • Author singhj Published - 05:03 PM, Fri - 24 November 23

ప్రపంచ కప్ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర ఓటమి నుంచి భారత క్రికెటర్లు, అభిమానులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నెక్స్ట్ ఆడే ఐసీసీ ట్రోఫీలపై ఫోకస్ పెట్టాలని ప్లేయర్లకు సూచిస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి క్రికెట్ లవర్స్​కు ఊరట కలిగించేలా మంచి విజయం సాధించింది భారత్. వరల్డ్ కప్ ముగిసిన నాల్రోజులకే ఆసీస్​తో మొదలైన ఐదు టీ20ల సిరీస్​ను విక్టరీతో షురూ చేసింది టీమిండియా. వైజాగ్ వేదికగా గురువారం జరిగిన మొదటి మ్యాచ్​లో 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు మూడు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు భారీ స్కోరు చేసింది. ఓపెనర్​గా మారిన స్టీవ్ స్మిత్ (52) ఆకట్టుకోగా.. జోష్ ఇంగ్లిస్ (110) సెంచరీతో సత్తా చాటాడు.

ఛేజింగ్​లో సూర్యకుమార్ యాదవ్ (80) చెలరేగడంతో భారత్​ ఈజీగా టార్గెట్​ను చేరుకుంది. మన ఇన్నింగ్స్​ మొదటి ఓవర్​లోనే రుతురాజ్ గైక్వాడ్ డైమండ్ డకౌట్​గా వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ (21) కూడా త్వరగానే పెవిలియన్​కు చేరుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ (58) అండతో ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు సూర్యకుమార్. క్రీజులో సెటిలయ్యాక వీళ్లిద్దరూ బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ఆ తర్వాత తక్కువ గ్యాప్​లో ఈ ఇరువురూ ఔటైనా.. ఆఖర్లో రింకూ సింగ్ (22) మెరుపులు మెరిపించడంతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో విజయం సాధించినా కొన్ని సమస్యలు మాత్రం వదలడం లేదు.

ఆసీస్​తో ఫస్ట్ టీ20లో ముగ్గురు భారత బ్యాటర్లు రనౌట్​గా వెనుదిరిగారు. తొలి ఓవర్​లోనే జైస్వాల్ రాంగ్ కాల్ కారణంగా రుతురాజ్ డైమంట్ ఔట్​అవ్వాల్సి వచ్చింది. రెండో రన్​కు ఛాన్స్ లేకున్నా గైక్వాడ్​ను పిలిచి.. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు జైస్వాల్. దీంతో అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చిన రుతురాజ్ రనౌట్​ అవ్వాల్సి వచ్చింది. పైకి సమన్వయ లోపంలా కనిపిస్తున్నా జైస్వాల్ రాంగ్ కాల్ వల్లే గైక్వాడ్ ఔట్ అయ్యాడని చెప్పొచ్చు. ఇన్నింగ్స్ ఆఖర్లో మరో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు ఇలాగే ఔటయ్యారు. రింకూకు స్ట్రైక్ ఇచ్చే ఉద్దేశంతో రవి బిష్ణోయ్, అక్షర్​దీప్ సింగ్​ రనౌట్ అయ్యారు. అయితే వీళ్లిద్దరూ మరింత వేగంగా పరిగెత్తినా, డైవ్ కొట్టినా, కాస్త ముందే రెస్పాండ్ అయినా ఈజీగా క్రీజులోకి చేరుకునేవారు.

బిష్ణోయ్, అక్షర్​దీప్ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తితే ఔటయ్యేవారు కాదు. ఈ మ్యాచ్​లో భారత్ బౌలింగ్ టైమ్​లో మరో సమస్య బయటపడింది. టీమ్​లో ఉన్న ఐదుగురు మెయిన్ బౌలర్ల సేవలు మాత్రమే వాడుకున్నారు. తిలక్ వర్మ, జైస్వాల్ రూపంలో సిక్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు. వరల్డ్ కప్​లో నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో అతడి యాక్షన్ అందర్నీ ఆకట్టుకుంది. అయినా ఆసీస్​తో ఫస్ట్ టీ20లో ఆరో బౌలింగ్ ఆప్షన్​ను అతడు వాడుకోలేదు. అదే కంగారూ టీమ్ మాత్రం ఆ ఆప్షన్​ను వినియోగించుకుంది.

ఈ మ్యాచ్​లో కొందరు బ్యాటర్లు చెత్త షాట్ ఆడి వికెట్లు పారేసుకోవడం కూడా ఒక సమస్య​ అనే చెప్పాలి. సూర్యకుమార్, తిలక్​లు ఔటైన ఓవర్లలో అప్పటికే పది రన్స్ వచ్చినా మరో భారీ షాట్​కు వెళ్లి ఔటయ్యారు. ఆఖర్లో అవసరం లేకపోయినా అక్షర్ పటేల్ ఇలాగే ఔటయ్యాడు. అతడి ప్లేస్​లో వచ్చిన బిష్ణోయ్, అక్షర్​దీప్ రనౌట్ అయ్యారు. దీంతో ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్​లో అనవసరంగా ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది. ఈ సమస్యల్ని కొత్త కెప్టెన్ సూర్యకుమార్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. మరి.. గెలిచినా భారత్​ను సమస్యలు వదలకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై మహ్మద్ షమి సీరియస్.. వాళ్లు చేసింది తప్పంటూ..!

Show comments