IND vs AUS Ruturaj Gaikwad Thunder Innings: ఆస్ట్రేలియాను చీల్చిచెండాడిన రుతురాజ్! 13 ఫోర్లు, 7 సిక్సులతో మాస్ హిట్టింగ్

ఆస్ట్రేలియాను చీల్చిచెండాడిన రుతురాజ్! 13 ఫోర్లు, 7 సిక్సులతో మాస్ హిట్టింగ్

  • Author singhj Published - 09:23 PM, Tue - 28 November 23

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్​లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 13 ఫోర్లు, 7 సిక్సులతో మాస్ హిట్టింగ్ చేశాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్​లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 13 ఫోర్లు, 7 సిక్సులతో మాస్ హిట్టింగ్ చేశాడు.

  • Author singhj Published - 09:23 PM, Tue - 28 November 23

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన పర్యాటక టీమ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన భారత జట్టుకు మంచి స్టార్ట్ దొరకలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్​కు చేరుకున్నాడు. జేసన్ బెరెన్​డార్ఫ్ అతడ్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (0) గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. కేన్ రిచర్డ్​సన్ బౌలింగ్​లో రెగ్యులర్ షాట్ ఆడి ఔటయ్యాడు ఇషాన్. 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (39) టీమ్​ను ఆదుకున్నారు.

రుతురాజ్-సూర్యకుమార్ కలసి మూడో వికెట్​కు 57 రన్స్ పార్ట్​నర్​షిప్ అందించారు. అయితే ఆ తర్వాత సూర్యను కొత్త బౌలర్ ఆరోన్ హార్డీ వెన్కి పంపాడు. ఆరోన్ కెరీర్​లో ఇదే ఫస్ట్ వికెట్ కావడం గమనార్హం. అయితే సూర్య తర్వాత వచ్చిన తిలక్ వర్మ (31 నాటౌట్) మాత్రం మరింత అటాకింగ్ గేమ్ ఆడాడు. రుతురాజ్-తిలక్ కలసి మూడో వికెట్​కు ఏకంగా 141 పరుగులు జోడించారు. ఇందులో తిలక్ చేసింది తక్కువ రన్సే. ఈ పార్ట్​నర్​షిప్​లో రుతురాజ్ కాంట్రిబ్యూషనే ఎక్కువ. ఇక ఈ మ్యాచ్​లో టీమిండియా ఇన్నింగ్స్​లో రుతురాజ్ బ్యాటింగ్ హైలైట్ అని చెప్పాలి. 13 బౌండరీలు బాదిన అతడు.. ఏకంగా 7 సిక్సులతో ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు. రుతురాజ్ ఉతుకుడుతో భారత్ ఏకంగా 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది రుతూకు ఫస్ట్ సెంచరీ కావడం విశేషం. ఆసీస్​పై టీ20ల్లో సెంచరీ కొట్టిన తొలి భారత బ్యాటర్​గానూ అతడు చరిత్ర సృష్టించాడు. మరి.. రుతురాజ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ ఎక్కడ.. ఇంత నిరాశ ఎందుకు?

Show comments