Rohit Sharma: బ్యాటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన రోహిత్.. అతడి తెలివికి హ్యాట్సాఫ్!

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఓవర్​లో మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. హిట్​మ్యాన్ ఇలా ఎందుకు వెళ్లిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతడు ఎందుకిలా చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఓవర్​లో మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. హిట్​మ్యాన్ ఇలా ఎందుకు వెళ్లిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతడు ఎందుకిలా చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే చాలా మంది గొప్ప బ్యాట్స్​మన్ అని చెబుతారు. అవును, ప్రస్తుత తరం క్రికెటర్లలో హిట్​మ్యాన్ టాప్ క్రికెటర్స్​లో ఒకడిగా ఉన్నాడు. అతడి లాంటి విధ్వంసక ఓపెనర్ ఇప్పుడు ఏ టీమ్​లోనూ లేడు. రోహిత్ బ్యాట్ గర్జిస్తే అపోజిషన్ టీమ్స్​ వణుకుతాయి. తన బ్యాటింగ్​తో వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా పోయిస్తాడు రోహిత్. అయితే అతడు బ్యాటింగ్​లోనే కాదు.. కెప్టెన్సీలోనూ ఆరితేరాడు. మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి హిట్​మ్యాన్ మాస్టర్​మైండ్​ బాగా పనిచేస్తోంది. అది ఆఫ్ఘానిస్థాన్​తో ఆఖరి టీ20లోనూ కనిపించింది. సూపర్ ఓవర్​ టైమ్​లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ హఠాత్తుగా క్రీజులో నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా అతడు ఎందుకిలా చేస్తున్నాడో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. గాయం అవ్వలేదు అయినా రిటైర్డ్ ఔట్​గా వెనుదిరిగాడు హిట్​మ్యాన్. అయితే అతడి తెలివి గురించి తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన ఆఫ్ఘాన్​ కూడా అన్నే ఓవర్లు ఆడి అంతే స్కోరు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్​కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్​లో ఆఫ్ఘాన్ 16 పరుగులు చేసింది. దీంతో ఛేజింగ్​కు దిగిన టీమిండియా కూడా అన్నే రన్స్ చేయడంతో ఇంకో సూపర్ ఓవర్ పెట్టాల్సి వచ్చింది. అందులో భారత్ 10 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే తొలి సూపర్ ఓవర్​లో రోహిత్ శర్మ చేసిన ఓ పనికి ఆఫ్ఘాన్ మైండ్​బ్లాంక్ అయింది. అప్పటికే 2 సిక్సులు కొట్టి ఊపు మీద ఉన్నాడు హిట్​మ్యాన్. అయితే ఐదో బాల్​కు సింగిల్ మాత్రమే రావడంతో నాన్​స్ట్రయికింగ్ ఎండ్​కు వెళ్లిపోయాడు. గెలవాంటే ఒక్క బాల్​కు రెండు రన్స్ చేయాలి. ఈ టైమ్​లో తెలివిగా ఆలోచించిన రోహిత్ రిటైర్డ్ ఔట్​గా వెనుదిరిగాడు.

ఒక్క బాల్​లో రెండు పరుగులు తీయాలంటే బాగా పరిగెత్తాలి. స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న జైస్వాల్ ఎలాగూ పరిగెత్తుతాడు. కానీ తాను అంత ఫాస్ట్​గా రన్ తీయలేనని భావించిన రోహిత్ రిటైర్డ్ ఔట్​గా వెనుదిరిగాడు. సరైన సమయంలో సరైన రూల్​ను వాడుకొని వికెట్ల మధ్య పరిగెత్తడంలో మంచి పేరు తెచ్చుకున్న రింకూ సింగ్​ను గ్రౌండ్​లోకి దింపాడు. దీంతో చివరి బాల్​కు జైస్వాల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది మిస్సవడంతో ఒక రన్ తీశారు. స్ట్రయికింగ్ ఎండ్​కు వస్తున్న రింకూను ఔట్ చేసేందుకు ప్రయత్నించినా అతడు వేగంగా క్రీజులోకి వచ్చేశాడు. దీంతో సూపర్ ఓవర్ టై అయింది. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్​లో భారత్ గెలిచింది. ఒకవేళ రింకూ ప్లేస్​లో రోహిత్ ఉండి ఉంటే ఆ రన్ తీయడం చాలా కష్టమయ్యేది. కాస్త తేడా వచ్చినా రనౌట్ అయ్యేవాడు. అందుకే ముందే తెలివిగా ఆలోచించి రిటైర్డ్ ఔట్ తీసుకున్నాడు. దీంతో హిట్​మ్యాన్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. నీ తెలివి సూపర్బ్ బాస్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

ఇదీ చదవండి: Rohit Sharma: వీడియో: రోహిత్ స్విచ్‌ హిట్.. దీని ముందు మ్యాక్స్​వెల్​ కూడా పనికిరాడు!

Show comments