డివిలియర్స్‌ 31 బంతుల్లో సెంచరీ కంటే మ్యాక్స్‌వెల్‌ సెంచరీనే స్పెషల్‌! ఎందుకంటే?

వరల్డ్‌ కప్‌లో ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్ మ్య​క్స్‌వెల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. 2015లో

వరల్డ్‌ కప్‌లో ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్ మ్య​క్స్‌వెల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. 2015లో

వరల్డ్‌ కప్‌ హిస్టరీలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు మ్యాక్స్‌వెల్‌. బుధవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఈ వరల్డ్‌ కప్‌లోనే కాకుండా మొత్తం వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. మొత్తంగా 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో 104 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ కంటే ముందు.. మరో స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్ వార్నర్‌ సైతం సెంచరీతో చెలరేగాడు. 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 104 పరుగులు చేసి రాణించాడు. వార్నర్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ అంత మంచి స్టార్ట్‌ లభించలేదు. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఒక చివర్లో మ్యాక్స్‌వెల్‌ అయితే విధ్వంసం సృష్టించాడు. అయితే.. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు కూడా నమోదు చేశాడు మ్యాక్స్‌వెల్‌. వన్డే క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా మ్యాక్సీ రికార్డులెక్కాడు. గతంలో కేవలం 2015లో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అదే అత్యంత వేగవంతమైన సెంచరీ. అయితే.. ఆ సెంచరీ చేసింది కూడా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లలోనే. అయితే.. ఏబీడీ ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. కానీ, మ్యాక్స్‌వెల్‌ 40వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సునామీ బ్యాటింగ్‌తో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. అందుకే ఏబీడీ చేసిన 31 బంతుల్లో సెంచరీ కంటే.. మ్యాక్స్‌వెల్‌ చేసిన సెంచరీ కాస్త స్పెషల్‌ అనే చెప్పాలి. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. బదులుగా నెదర్లాండ్స్‌ కేవలం 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో ఆసీస్‌ ఈ వరల్డ్‌ కప్‌లో 309 పరుగులతో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. మరి మ్యాక్స్‌వెల్‌ 40వ ఓవర్‌లో వచ్చి సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. మియా డామినేషన్ మామూలుగా లేదుగా!

Show comments