వీడియో: విరాట్‌ కోహ్లీతో రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంభీర్‌!

Gautam Gambhir, Virat Kohli: టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ శ్రీలంక పర్యటనకు బయలుదేరేముందు.. మీడియాలో మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీతో తన రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Virat Kohli: టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ శ్రీలంక పర్యటనకు బయలుదేరేముందు.. మీడియాలో మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీతో తన రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతో తన అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్‌ కోచ్‌గా అపాయింట్‌ అయిన తర్వాత.. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన గంభీర్‌.. చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి.. శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్లు, టీ20లకు కొత్త కెప్టెన్‌ ఎంపిక, సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల కెరీర్‌, జట్టులో చోటు దక్కని వారి గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే టీమిండియాకు పెద్ద దిక్కులాంటి విరాట్‌ కోహ్లీతో తన జర్నీ ఎలా ఉండబోతుంది? ఇద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి రిలేషన్‌షిప్‌ ఎలా ఉంది అనే విషయాలపై స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

గంభీర్‌ మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లీ ఒక వరల్డ్‌ క్లాస్‌ అథ్లెట్‌, అతనో వరల్డ్‌ క్లాస్‌ క్రికెటర్‌.. అతనితో నా రిలేషన్‌షిప్‌ బాగుంది. నేను హెడ్‌ కోచ్‌గా అపాయింట్‌ కాగానే.. ఇద్దరు చాట్‌ చేసుకున్నాం. అయినా మా అనుబంధం పబ్లిక్‌ కోసం కాదు. ఫీల్డ్‌లో మీరు చేసేది, మీరు మా గురించి రాసేది అంతా టీఆర్‌పీల కోసం అయితే బాగుంటుంది కానీ.. ఆఫ్‌ ది ఫీల్డ్‌ మేం ఎంతో సన్నిహితంగా ఉంటాం. ఐపీఎల్‌లో వేర్వేరే జట్లకు ఆడుతున్న సమయంలో.. ఎవరి టీమ్‌ విజయం వారికి ఫస్ట్‌ ప్రియారిటీ.. కానీ, ఇప్పుడు ఇద్దరం కలిసి దేశం కోసం పనిచేయబోతున్నాం. ఇద్దరం కలిసి ఇండియాను మరిన్ని మ్యాచ్‌ల్లో గెలిపించేందుకు కృషి చేస్తాం’ అంటూ గంభీర్‌ పేర్కొన్నాడు.

అయితే.. అసలు గంభీర్‌ హెడ్‌ కోచ్‌ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటి నుంచి.. విరాట్‌ కోహ్లీతో ఎలా ఉంటాడో అనే అనుమానం అందరిలో ఉంది. ఎందుకంటే.. వాళ్లిద్దరూ ఐపీఎల్‌లో పాము ముంగిసల్లా గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్‌ 2023 సందర్భంగా అయితే.. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో.. కోహ్లీ-గంభీర్‌కు ఒకరంటే ఒకరికి అస్సలు పడదని అంతా ఫిక్స్‌ అయిపోయాడు. పైగా ఇద్దరు ఢిల్లీకి చెందిన క్రికెటర్లే కావడంతో వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండొచ్చని క్రికెట్‌ అభిమానులు కూడా భావించారు. కానీ, హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌.. తొలి ప్రెస్‌మీట్‌తోనే అలాంటిదేం లేదని.. నేను కోహ్లీ ఆఫ్‌ ది ఫీల్డ్‌ మంచి ఫ్రెండ్స్‌ అంటూ గంభీర్‌ క్లారిటీ ఇచ్చేశాడు. పైగా ఐపీఎల్‌ 2024 సందర్భంగా కోహ్లీ-గంభీర్‌ ఒకరినొకరు పలకరించుకుని, నవ్వుతూ మాట్లాడుకోవడం కూడా మనం చూశాం. మరి కోహ్లీతో తన అనుబంధం అందరి ముందు చూపించేది కాదని గంభీర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments