వన్డే ప్రపంచ కప్​లో ఆడనంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్! కారణం?

వన్డే ప్రపంచ కప్​లో ఆడనంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్! కారణం?

  • Author singhj Published - 05:04 PM, Thu - 27 July 23
  • Author singhj Published - 05:04 PM, Thu - 27 July 23
వన్డే ప్రపంచ కప్​లో ఆడనంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్! కారణం?

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్​ కప్​కు సమయం దగ్గర పడుతోంది. ఈసారి మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 50 ఓవర్ల ఫార్మాట్​లో బహుశా ఇదే చివరి వరల్డ్ కప్ అనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఎవరు కప్​ను నెగ్గుతారోనని అందరూ ఇంట్రెస్టింగ్​గా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మాత్రం 2011 సీన్​ను రిపీట్ చేయాలని చూస్తోంది. ఆ ఏడాది కూడా వరల్డ్ కప్ భారత్​లోనే జరిగిన విషయం విదితమే. మళ్లీ స్వదేశంలో టోర్నీ జరుగుతున్నందున టీమిండియా కప్ నెగ్గాలని ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు.

వరల్డ్ కప్​కు ముందు సాధ్యమైనంత లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఆడి టోర్నీకి సన్నద్ధంగా ఉండాలని అన్ని టీమ్స్ భావిస్తున్నాయి. అయితే ఇంగ్లండ్​ ఫ్యాన్స్ ఆశలపై వరల్డ్ కప్-2019 హీరో బెన్ స్టోక్స్ నీళ్లు చల్లాడు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్​ టోర్నీకి తాను అందుబాటులో ఉండే ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్ ముగిసిన అనంతరం తాను హాలీ డే ట్రిప్​నకు వెళ్తున్నానని స్టోక్స్ తెలిపాడు. అతడి కామెంట్స్​తో ఇంగ్లీష్ టీమ్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. జట్టుకు మళ్లీ కప్​ను అందిస్తాడనుకుంటే ఇలా హాలీ డే ట్రిప్​నకు వెళ్తానని చెప్పడం ఏంటని షాక్ అవుతున్నారు. ఇకపోతే, స్వదేశంలో 2019లో జరిగిన వరల్డ్ కప్ ఈవెంట్​లో ఇంగ్లండ్ ఫస్ట్​ టైమ్ ఛాంపియన్​గా అవతరించిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్​తో లండన్​లో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో విజయం ఇంగ్లండ్​ను వరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి మొదలుకానున్న ఐసీసీ మెగా టోర్నీలో డిఫెండింగ్​ ఛాంపియన్​గా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. కాగా, టీమ్​తో పాటు ఫ్యాన్స్​కు ఊహించని షాక్ ఇస్తూ గతేడాది వన్డేలకు గుడ్ బై చెప్పాడు స్టోక్స్. కానీ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్ మాథ్యూ మాట్, కెప్టెన్ జోస్ బట్లర్ చేసిన వ్యాఖ్యలతో ఈ స్టార్ ఆల్​రౌండర్ రీఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ స్టోక్స్ మాత్రం రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను రిటైర్ అయ్యానని.. ఈ టెస్టు ముగిసిన తర్వాత సెలవులు తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో బెన్ స్టోక్స్ వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదని తేలిపోయింది.

Show comments