ఆఫ్ఘానిస్థాన్ వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. పొట్టి కప్పు కొడుతుందా?

ఆఫ్ఘానిస్థాన్ తమ టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. పక్కా టీ20 స్పెషలిస్ట్​లతో కూడిన ఆఫ్ఘాన్ స్క్వాడ్ చాలా డేంజరస్​గా కనిపిస్తోంది.

ఆఫ్ఘానిస్థాన్ తమ టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. పక్కా టీ20 స్పెషలిస్ట్​లతో కూడిన ఆఫ్ఘాన్ స్క్వాడ్ చాలా డేంజరస్​గా కనిపిస్తోంది.

ఐపీఎల్-2024 హవా ఒకవైపు నడుస్తున్నా.. మరోవైపు టీ20 ప్రపంచ కప్ గురించి కూడా జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. అయితే క్రికెటింగ్ నేషన్స్ తమ ప్రపంచ కప్ జట్లను ప్రకటించడంతో సందడి షురూ అయింది. మొదట న్యూజిలాండ్ తమ వరల్డ్ కప్ టీమ్​ను అనౌన్స్ చేసింది. ఆ తర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, టీమిండియా, ఆస్ట్రేలియా జట్లను ప్రకటించాయి. ఈ కోవలోనే ఆఫ్ఘానిస్థాన్ కూడా తమ టీమ్​ గురించి అనౌన్స్​మెంట్ చేసింది. పక్కా టీ20 స్పెషలిస్ట్​లతో కూడిన ఆఫ్ఘాన్ స్క్వాడ్ చాలా డేంజరస్​గా కనిపిస్తోంది. ఆ టీమ్​లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

15 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘానిస్థాన్ టీ20 స్క్వాడ్​కు స్పిన్ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అతడితో పాటు రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జాద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయి, నజీబుల్లా జాద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదీన్ నయీబ్, కరీమ్ జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆఫ్ఘాన్ జట్టులో ఆల్​రౌండర్లతో పాటు మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. పేరుకే చిన్న టీమ్ అయినా జట్టు నిండా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు.

రషీద్, నబీ, ఒమర్జాయి రూపంలో నిఖార్సయిన ఆల్​రౌండర్లు ఆఫ్ఘాన్ స్క్వాడ్​లో ఉన్నారు. వీళ్లలో రషీద్, నబీ ఐపీఎల్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ టీ20 టోర్నీల్లో ఆడటం తెలిసిందే. నూర్ అహ్మద్, ముజీబ్, గుల్బదీన్, నవీన్ ఉల్ హక్ రూపంలో పక్కా టీ20 స్పెషలిస్ట్​లు జట్టులో ఉన్నారు. వీళ్లందరూ కలసికట్టుగా ఆడితే ఎంతటి టీమ్​నైనా ఓడించగలరు. సంచలనాలకు మారుపేరు లాంటి టీ20 క్రికెట్​లో చిన్న టీమ్, పెద్ద టీమ్ అనేది పెద్ద తేడా కాదు. ఒక్క ఓవర్ లేదా ఒక్కోసారి ఒక్క బంతికే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. కాబట్టి జట్టు నిండా స్పెషలిస్ట్​లతో, డేంజరస్ ప్లేయర్లతో నిండి ఉన్న ఆఫ్ఘాన్ పొట్టి కప్పు కొట్టాలని కసిగా ఉంది. కప్పు కొట్టకపోయినా గానీ ఫేవరెట్ టీమ్స్​కు షాకివ్వడం పక్కాగా కనిపిస్తోంది. మరి.. ఆఫ్ఘాన్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments