Revanth Reddy At India Round Table: యువతకి కూరగాయలు అమ్మే ఉద్యోగాలా? ఇదేమి ఉపాధి రేవంత్‌?

యువతకి కూరగాయలు అమ్మే ఉద్యోగాలా? ఇదేమి ఉపాధి రేవంత్‌?

ఎన్నికల వేళ రేవంత్‌ రెడ్డి తీరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు కాం‍గ్రెస్‌ నేతలు, కార్యకర్తలు. తాజాగా యువతకు ఉపాధి కల్పన గురించి మాట్లాడుతూ.. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు. .

ఎన్నికల వేళ రేవంత్‌ రెడ్డి తీరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు కాం‍గ్రెస్‌ నేతలు, కార్యకర్తలు. తాజాగా యువతకు ఉపాధి కల్పన గురించి మాట్లాడుతూ.. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు. .

కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తీరు చూసి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలే తలలు పట్టుకుంటున్నారు. రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత.. పార్టీని బలోపేతం చేస్తాడని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇన్నాళ్లు రేవంత్‌​.. ఎంతో దూకుడుగా ముందుకు వెళ్లారు. ఇక ఎన్నికల వేళ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు రేవంత్‌ రెడ్డి. ప్రచార సభల్లో సంయమనం కోల్పోతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. పరుష పదాలు వాడుతున్నారు.

ఇక రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసి.. దానిపై విమర్శలు ఎదుర్కొంటున్నారు రేవంత్‌. మీడియాపై కూడా విరుచుకుపడ్డారు. ఇప్పటికే రేవంత్‌ తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన పడుతుండగా.. తాజాగా ఆయన చేసిన ప్రకటన దాన్ని మరింత పెంచింది. ఆ వివరాలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పన గురించి మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘మేము అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పన కోసం.. రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే దుస్థితి లేకుండా.. మూసీ నది చుట్టూ .. 24 గంటలు రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా అకవాశం కల్పిస్తాం. దీని వల్ల యువతకు ఉపాధితో పాటు.. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు .. టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని’’ చెప్పుకుంటూ పోయారు

ఇక రేవంత్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయలు అమ్ముకోవడం.. ఉపాధి కల్పన అవుతుందా.. అది కూడా మూసీ నది చుట్టూ.. అర్థరాత్రి ఎవరైనా వచ్చి కూరగాయలు కొంటారా.. ఇంత ఆలోచన లేకుండా ఎలా మాట్లాడతారు.. ఉద్యోగాల కల్పన అంటే ఇదేనా అని మండి పడుతున్నారు. కూరగాయలు అమ్ముకోవడం చిన్నతనం కాదు.. కానీ యువత మొత్తాన్ని కూరగాయలు అమ్ముకునేలా చేస్తామంటున్నారు.. అసలు ఇదేం దిక్కుమాలిన ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు స్పందిస్తూ.. మా ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సాహించడం కోసం గొర్రెల పంపకం చేపడితే.. మీరు ఎలాంటి విమర్శలు చేశారు. అంటే ఇక ఆ సామాజిక వర్గం వాళ్లు ఎప్పుడు గొర్లు కాసుకునే బతకాలా అంటూ మండి పడ్డారు. అసలు ప్రభుత్వం నిర్ణయం ఉద్దేశం, దాని ప్రయోజనాలు తెలుసుకోకుండా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మీరేమో.. ఏకంగా యువతకు మూసీ నదీ చుట్టూ మూడు షిఫ్ట్‌లలో కూరగాయల అమ్ముకునే అవకాశం కల్పిస్తాం అంటున్నారు. ఉపాధి కల్పన అంటే ఇదేనా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి రేవంత్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ శ్రేణులు ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

Show comments