Revanth Reply To YS Jagan Tweet: AP సీఎం జగన్ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఏమన్నారంటే

AP సీఎం జగన్ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఏమన్నారంటే

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ట్వీట్ కి రేవంత్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ట్వీట్ కి రేవంత్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసై.. రేవంత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి.. సచివాలయానికి వెళ్లారు. పోలీసుల గౌరవ వందనం, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టారు. అనంతరం 6 వ అంతస్తుకి వెళ్లి ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు రేవంత్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు.

ఆ తర్వాత తొలి కేబినెట్ సమావేశం నిర్వహించి.. 6 గ్యారెంటీల అమలు, విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇక తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌కు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం…అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది‘ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్విట్లు వైరల్ గా మారాయి

ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏపీ సీఎం జగన్.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడమే కాక.. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ ‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంలు చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మెలసి ఉండాలని.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ.. మద్దతుగా నిలుస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.

Show comments