OTT Suggestions- Best Watch Alone Movie Addicted: కోరికలకు లొంగిపోయి కట్టుకున్న భర్తను.. OTTలో చీటింగ్ వైఫ్!

కోరికలకు లొంగిపోయి కట్టుకున్న భర్తను.. OTTలో చీటింగ్ వైఫ్!

OTT Suggestions- Best Watch Alone Movie Addicted: ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ అన్ని రకాల జానర్స్ చూస్తున్నారు. వాటిల్లో లవ్ స్టోరీలు మాత్రమే కాదు.. ఇలాంటి చీటింగ్ స్టోరీస్ కూడా ఉంటాయి. అందుకే మీకోసం ఒక మంచి చీటింగ్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Watch Alone Movie Addicted: ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ అన్ని రకాల జానర్స్ చూస్తున్నారు. వాటిల్లో లవ్ స్టోరీలు మాత్రమే కాదు.. ఇలాంటి చీటింగ్ స్టోరీస్ కూడా ఉంటాయి. అందుకే మీకోసం ఒక మంచి చీటింగ్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం.

భార్యాభర్తల బంధం అనేది ఎంత పవిత్రమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా కూడా అలాంటి బంధాన్ని కించ పరచడం, అవహేళన చేయకూడదు. కానీ, ఇప్పుడు సమాజంలో భార్యాభర్తలు క్షణికావేశంలో, వింత కోరికల కోసం ఆ బంధాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదిగో అచ్చం ఈ మహిళ చేసినట్లే. ఈమె కూడా తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. ఓటీటీలో ఈ మూవీ కచ్చితంగా ఎంతో మందికి కనువిప్పు అనే చెప్పాలి. కాకపోతే హాలీవుడ్ చిత్రం కాబట్టి కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. అంటే చెప్పిన విధానం ఏదైనా కూడా చెప్పిన మెసేజ్ మాత్రం నూటికి నూరు పాళ్లు నిజం.

ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. వాటిలో చాలా యాక్షన్, ఎమోషన్, లవ్ స్టోరీలు ఉంటే.. కొన్ని మాత్రం ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు ఉంటాయి. చెడును చెప్పడానికి ముందు ఆ చెడు ఎలాంటిది? ఎంత దారుణాలు చేయగలదు అనే విషయాలను చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అదే ధోరణిలో తెరకెక్కిచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఎలా తీశారు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేదే ఇక్కడ పాయింట్. ఒక భార్య తన చేతులారా తన కాపురాన్ని, తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంది అనేది ఈ సినిమా కథలో స్పష్టంగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమా చాలామందికి కనువిప్పు అనే చెప్పాలి.

ఈ సినిమాలో హీరోయిన్ కు మంచి కుటుంబం ఉంటుంది. భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉంటారు. తాను తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే ఆ చిత్రకారుడు తన జీవితంలోకి వచ్చాడో అప్పుడే తన జీవితం నాశనం అయిపోయింది. అతని పెయింటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా.. తన బొమ్మ గీసేందుకు పర్మిషన్ ఇస్తుంది. అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ చనువుతో ఆమెతో శారీ*రక బంధాన్ని స్టార్ట్ చేస్తాడు. ఒకసారి జరిగితే అది తప్పు అవుతుంది. కానీ, ఆ మహిళ ఆ తప్పును తరచూ చేయడం స్టార్ట్ చేస్తుంది. రాత్రులు భర్తకు తెలియకుండా ప్రియుడిని కలవడం స్టార్ట్ చేస్తుంది.

మొత్తం భర్త గమనిస్తూనే ఉంటాడు. తాను చేస్తోంది తప్పు అని ఆ మహిళకు కూడా తెలుసు. తన మైండ్ మార్చుకోవడానికి థెరపిస్ట్ ని కూడా కలుస్తూ ఉంటుంది. కానీ, రాత్రి*కి మాత్రం ప్రియుడి వద్దకు పోతూ ఉంటుంది. ఇదంతా ఒకరోజు బయటకు వస్తుంది. అప్పుడు ఆ మహిళ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అసలు ఆమె తన తప్పును తెలుసుకుందా? తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకుందా అనేదే కథ. ఈ సినిమా పేరు ‘అడిక్టెడ్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కాకపోతో కాస్త బో*ల్డ్ గా ఉంటుంది.

Show comments