Harom Hara OTT : సుధీర్ బాబు హరోం హర మూవీ OTT స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

Harom Hara OTT : సుధీర్ బాబు హరోం హర మూవీ OTT స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. థియేటర్ లో రిలీజ్ అయినా ఏదైనా కొత్త సినిమా ఓటీటీ లోకి వస్తుందంటే మాత్రం ప్రేక్షకులను ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇంతే..

ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. థియేటర్ లో రిలీజ్ అయినా ఏదైనా కొత్త సినిమా ఓటీటీ లోకి వస్తుందంటే మాత్రం ప్రేక్షకులను ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇంతే..

ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో అతి తక్కువ సినిమాలతో పాపులర్ అయినా హీరోలలో.. సుధీర్ బాబు కూడా ఒకరు. గత కొన్నాళ్లుగా సుధీర్ ప్రయోగాత్మకమైన పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలియనిది కాదు. అతను ఆ పాత్రలకు తన వంతు న్యాయం చేసిన కానీ.. ఆ సినిమాలేవీ కూడా సుధీర్ కు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాని చెప్పి తీరాలి. ఇక ఈ క్రమంలో సుధీర్ బాబు లేటెస్ట్ గా నటించిన సినిమా “హరోం హర” . ఈ సినిమా జూన్ 14 న థియేటర్ లో విడుదలయ్యి.. పాజిటివ్ రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఆల్రెడీ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ కన్ఫర్మ్ అవ్వగా.. ఇక ఇప్పుడు హరోం హర మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

హారోహర సినిమా 1980 పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో రూపొందించారు దర్శకుడు. కాగా ఈ మూవీకి జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకే.. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకుంది. హరోం హర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ లో ప్రత్యేక్షం అవుతున్నాయి. పైగా ఒకేసారి రెండు ఓటీటీ లలో ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . ఈ సినిమా విషయంలోనే అదే జరిగింది. హరోం హర సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ తో పాటు.. ఆహ ప్లాట్ ఫార్మ్ కూడా సొంతం చేసుకుంది. ఇక జులై 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లే కానీ.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక హరోం హర సినిమా కథ విషయానికొస్తే.. ఆంధ్రపద్రేశ్, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ లో కుప్పం అనే ప్రాంతం ఉంది. ఈ ఊరిలో తిమ్మారెడ్డి, అతడి తమ్ముడు బసవ, కొడుకు శరత్ రెడ్డి లదే పెత్తనం. ఊరిలో ప్రజలందరికి కూడా వారంటే చాలా భయం. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలోకి ఎంటర్ అవుతాడు సుధీర్ బాబు. అతను అక్కడ ఓ కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ పడడంతో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాడు. అతనితో పాటు తన ఫ్రెండ్ కానిస్టేబుల్ పళని స్వామి కూడా సస్పెండ్ అవుతాడు. అయితే అతని దగ్గర ఓ గన్ ఉంటుంది. దానితో పాటు ఓ బ్లు ప్రింట్ కూడా ఉంటుంది. ఇక సుధీర్ తన తెలివితేటలతో ఓ గన్ ను కూడా తయారు చేస్తాడు. అలాగే ఉద్యోగం పోడానికి కారణం అయినా శరత్ రెడ్డితో కూడా చేతులు కలుపుతాడు. అసలు కథ ఏంటి ! సుధీర్ కు ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments