Swetha
ఓటీటీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శన్ హీరోగా నటించిన ఒక కన్నడ యాక్షన్ మూవీ.. తెలుగు వెర్షన్ లేటెస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓటీటీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శన్ హీరోగా నటించిన ఒక కన్నడ యాక్షన్ మూవీ.. తెలుగు వెర్షన్ లేటెస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
ఓటీటీ లో ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్, సిరీస్ లు కొన్నైతే.. డబ్బింగ్ , రీమేక్ సినిమాలు, సిరీస్ లు మరికొన్ని. తెలుగు ఆడియన్స్ మాత్రం వాటితో ఏమి సంబంధం లేకుండా.. స్టోరీ బావుంటే వెంటనే ఆ సినిమాకు క్రేజ్ పెంచేస్తారు. ఇలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలను, సిరీస్ లను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీ లో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలను .. తెలుగు, హింది, తమిళ , మలయాళ వెర్షన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనితో ఆడియన్స్ కూడా ఎవరికీ నచ్చిన భాషలో వారు సినిమాలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కన్నడ సినిమా అయిన కాటేరా మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఇది ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతోందన్న వివరాలను చూసేద్దాం.
కాటేరా సినిమాకు తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను 1970’స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే.. ఓ పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. ఈ సినిమాలో దర్శన్ హీరోగా నటించగా.. ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమాను.. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కాగా.. ఈ కన్నడ మూవీ 70 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. 2023 వ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమా కన్నడ వెర్షన్ ఫిబ్రవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక ఇప్పుడు కన్నడ వెర్షన్ తో పాటు.. తెలుగు, తమిళ వెర్షన్స్ కూడా ఏప్రిల్ 14 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ కన్నడ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకోనుందో చూడాలి.
ఇక కాటేరా కథ విషయానికొస్తే.. భీమనహల్లి అనే ప్రాంతంలో కమ్మరి పని చేసుకుంటూ ఉంటాడు హీరో. విలన్ ను చంపి జైలు శిక్షను అనుభవిస్తున్న హీరో పెరోల్ మీద బయటకు వస్తాడు. ఇక జైలు నుంచి విడుదలైన హీరోను చంపేందుకు.. చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు హీరో విల్లన్ ను ఎందుకు చంపాల్సి వస్తుంది. వారంతా ఎవరు? భీమన అనే ప్రాంతంలో కమ్మరి పని చేసే కాటేరా ఎందుకు జైలుకు వెళ్ళాడు.. హీరోయిన్ హీరో కు ఎలా పరిచయం అవుతుంది. వారిద్దరూ కలిసి భీమనహల్లి ప్రాంతంలో చాలా ఏళ్లుగా పంటలను సాగుచేస్తోన్న రైతులకు ఎటువంటి సహాయాలను చేశారు ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కుల వివక్షలు, భూ సంస్కరణలు, లవ్ స్టోరీ ఇలా.. అన్ని జోనర్స్ కలిసిని మూవీ గా కాటేరా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.