Swetha
ఓటీటీ లలో ఎన్నో సినిమాలు ఉంటున్నాయి. అయితే శ్రీరామ నవమి పర్వదినాన.. రామునికి సంబంధించిన సినిమాలు ఏ ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.
ఓటీటీ లలో ఎన్నో సినిమాలు ఉంటున్నాయి. అయితే శ్రీరామ నవమి పర్వదినాన.. రామునికి సంబంధించిన సినిమాలు ఏ ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.
Swetha
ఓటీటీ లలో ఉండే సినిమాలు అన్ని జోనర్స్ కు సంబంధించినవి ఉంటాయి. అయితే వీటిలో భక్తిరస చిత్రాలు కూడా ఎన్నో ఉంటాయి. నేటి తరానికి తెలియని ఎన్నో చారిత్రిక విషయాల గురించి ఈ సినిమాలలో చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చిత్రాలను చూడడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, శ్రీరామ నవమి పర్వదినాన.. రామునికి సంబంధించిన ఎన్నో సినిమాలు ఓటీటీ లలో అందుబాటులో ఉన్నాయి. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. రామాయణం గురించి అందరికి తెలిసినా కానీ.. ఇంకా తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఈ సినిమాల ద్వారా అందరికి తెలియపరిచారు . కాబట్టి ఈ సినిమాలను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటె మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఆ శ్రీరామ చంద్రునికి సంబంధించిన సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.
ఓటీటీ లలో అందుబాటులో ఉన్న శ్రీరాముని సినిమాలు ఇవే..
1) శ్రీరామ రాజ్యం – ప్రైమ్ వీడియో, జీ 5
నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు అగ్ర దర్శకుడు బాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీతమ్మ వారి పాత్రలో నయనతార నటించింది. ఈ సినిమాలోని పాటలు, వారి నటన అందరిని ఎంతో ఆకర్షితులను చేసింది.
2) లవకుశ – ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్
బహుశా ఈ సినిమా ఇప్పటి జెనెరేషన్ వారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా వచ్చి దాదాపు 60 ఏళ్ళు దాటిపోయింది. ఈ సినిమాను చూసేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఇంకొకటి ఉండదని చెప్పి తీరాలి. అప్పటికి ఇప్పటికి ఈ సినిమా అంటే అందరు ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇప్పటి జెనెరేషన్ వారు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
3) శ్రీరామదాసు – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
భద్రాద్రిలో కొలువు తీరిన సీతాసమేత శ్రీరామ చంద్రుడు.. వారి గుడి కట్టించిన వ్యక్తి రామదాసు. ఆ రామదాసు జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన సినిమా శ్రీరామదాసు. ఈ సినిమాలో నాగార్జున రామదాసు పాత్రలో జీవించారని చెప్పి తీరాలి. 2006 లో వచ్చిన ఈ సినిమా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
4) సంపూర్ణ రామాయణం – యూట్యూబ్, ఈటీవీ విన్
రామాయణంలో అనేక కాండలు ఉంటాయని అందరికి తెలిసిందే.. ఈ క్రమంలో వాటి అన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం సంపూర్ణ రామాయణాన్ని చూడాల్సిందే. బాపు తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం.. యూట్యూబ్ తోపాటు ఈటీవీ విన్ లోను అందుబాటులో ఉంది.
5) బాల రామాయణం – యూట్యూబ్
బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించిన ఈ సినిమా.. కేవలం పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సినిమాలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు కనిపిస్తారు. ఇప్పటి జెనెరేషన్ వారు అసలు మిస్ కాకుండా చూడవలసిన సినిమాలలో ఈ సినిమా ఒకటి. యు ట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఇక ఈ సినిమాలతో పాటు.. సీతారామ కల్యాణం, భూకైలాస్, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం లాంటి ఎన్నో చిత్రాలు యూ ట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. మరి, ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.