OTT Movie: OTT లోకి వచ్చేసిన అవతార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ లు అన్ని ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. కానీ, డాక్యుమెంటరీ సిరీస్ లు మాత్రం ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో వచ్చిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ లు అన్ని ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. కానీ, డాక్యుమెంటరీ సిరీస్ లు మాత్రం ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో వచ్చిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకంటే కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువైపోయింది. కొన్ని విపరీతమైన బజ్ తో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంటే.. మరికొన్ని సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేస్తున్న క్రమంలో.. ప్రేక్షకులు కూడా వాటిని అదే రేంజ్ లో ఆదరిస్తున్నారు. అందులోను డాక్యుమెటరీ సిరీస్ లకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ప్రముఖ దర్శకుడు.. జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ గా, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉంటూ రూపొందించిన.. డాక్యుమెంటరీ సిరీస్.. “సీక్రెట్స్ ఆఫ్ ది ఆక్టోపస్” ఓటీటీ లోకి వచ్చేసింది.మరి అది ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను.. చూసేద్దాం.

అవతార్ సినిమా అటు హాలీవుడ్ ప్రేక్షకులనే కాదు.. ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ లేటెస్ట్ గా రూపొందించిన.. ఓ డాక్యుమెంటరీ సిరీస్.. “సీక్రెట్స్ ఆఫ్ ది ఆక్టోపస్” . ఈ సిరీస్ కు జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా.. ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు, కాగా ఈ సిరీస్ కు హాలీవుడ్ యాక్టర్ పాల్రుడ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది. ఒక ఆక్టోపస్ గురించి తెలియని ఎన్నో సీక్రెట్స్ ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అంతే కాకుండా సముద్రం గర్భంలో జీవించే ఆక్టోపస్ జీవులకు సంబంధించిన ఎన్నో వింతలు, విశేషాలు.. ఎవరికీ తెలియని సత్యాలు.. ఈ సిరీస్ లో చూపించారు.

ఆక్టోపస్ అంటే సముద్రంలో నివసిస్తుంది అని మాత్రమే అందరికి తెలుసు, కానీ అవి బ్రతకడానికి కొత్త కొత్త టెక్నీక్స్ ఉపయోగిస్తాయని. అవి కూడా మనుషులలాగే కలలు కంటాయని. పైగా మనుషులతో మాట్లాడగలవ్ అని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఈ సిరీస్ లో మాత్రం అన్ని ఎంతో స్పష్టంగా చూపించారు. గతంలో కూడా సీక్రెట్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్‌, సీక్రెట్స్ ఆఫ్ ది వేల్స్ పేరుతో జేమ్స్ కామెరూన్ కొన్ని డాక్యుమెంటరీస్ ని రూపొందించాడు. అవి కూడా హాట్ స్టాట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీస్ ద్వారా ప్రజలకు యానిమల్స్ గురించి తెలియని ఎన్నో సీక్రెట్స్ ను తెలియపరిచారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments