విజయశాంతి,శశికళ సమావేశం మీద తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తి

తమిళనాడు లో విద్యార్థి ఆత్మహత్య వ్యవహారం సంచలనం రేపుతున్న తరుణంలో తెలంగాణా బిజెపి ప్రచార కమిటీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తమిళనాడులో ప్రత్యక్షం కావడం సంచలనం అయింది. నిన్న తమిళనాడులోని తంజావూరు వెళ్ళిన విజయశాంతి ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అరియలూర్‌కు చెందిన విద్యార్థి తంజావూరులోని ప్యూర్ హార్ట్ హైస్కూల్‌లో చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థి మతమార్పిడి ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు అనే ప్రచారం సంచలనం అయింది.

ఈ కేసులో పాఠశాల యాజమాన్యంపై మతమార్పిడి కేసు నమోదు చేశారు. దీనితో ఈ అంశంపై బిజెపి సీరియస్ గా ఫోకస్ చేయడం, ఆ తర్వాత బిజెపి అధిష్టానం దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేయడం క్షణాల్లో జరిగాయి. ఈ నేేపథ్యంలో విజయశాంతి నేతృత్వంలోని బృందం ఈరోజు అరియలూరు వడుగపాళయంలోని విద్యార్థి ఇంటికి చేరుకుని వాళ్ళతో మాట్లాడింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసుకి బిజెపి బృందం వెళ్లి ఘటనపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన విజయశాంతి తమ బృందం కలెక్టర్ తో మాట్లాడిందని, కలెక్టర్ కు అన్ని విషయాలు చెప్పిందని పేర్కొంటూ… ఈ విషయంపై కలెక్టర్ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదన్నారు. ఇప్పుడు ఈ కేసు సీబీఐకి వెళ్లడంతో కలెక్టర్ మాట్లాడేందుకు కాస్త వెనుకంజ వేశారని అయితే కలెక్టర్ తాము చెప్పిన వివరాలన్నింటినీ పూర్తిగా విన్నారన్నారు. అలాగే ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.

అక్కడి వరకే బాగానే ఉంది గాని… నేడు విజయశాంతి వెళ్లి తమిళనాడు దివంగత సిఎం జయలలిత నెచ్చెలి, అన్నా డిఎంకె మాజీ అధ్యక్షురాలు శశికళను కలవడం సంచలనం అయింది. నేడు ఆమెతో మీడియాకు ఏ సమాచారం లేకుండా వెళ్లి విజయశాంతి భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ప్రధాన కారణం తెలియకపోయినా… జయలలిత బ్రతికి ఉన్న సమయంలో అన్నాడిఎంకెలో ఆమె యాక్టివ్ గా పని చేేశారు. ఆ సమయంలో శశికళతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయంతోనే విజయశాంతి భేటీ అయ్యారని అంటున్నారు.

ఇక విజయశాంతి అన్నాడిఎంకె పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం మూడేళ్ల క్రితం బలంగా జరిగింది. అక్కడ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ తో చెన్నై జిల్లాలో ఒక సీటు కూడా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అలాగే… ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో ఒక నియోజకవర్గం పేరుని పరిశీలించారు అనే ప్రచారం జరిగింది. కాని ఆమె కాంగ్రెస్ నుంచి నేరుగా బిజెపి లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం బిజెపిలో ఆమె యాక్టివ్ గా ఉన్నారు. బిజెపి మిత్రపక్షం అన్నాడిఎంకె… కాబట్టి ఆ కోణంలో ఏమైనా కలిశారా అనేది స్పష్టత రావడం లేదు. అవినీతి ఋజువు కావడంతో జైలుకి వెళ్లి వచ్చిన శశికళ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Show comments