Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ తమిళ నిర్మాత జాన్ మాక్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్థల వివాదం కేసులో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్తా తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. జాన్ మ్యాక్స్ అలియాస్ జాన్ జిన్నీ మ్యాక్స్‌కు నిర్మాతగా తమిళ చిత్ర పరిశ్రమలో ఓ మంచి పేరుంది. మైనా, సౌకార్‌పేట్టై, పొట్టు, సంభవం వంటి సినిమాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కొన్నేళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ద్వారా మ్యాక్స్‌కు మోహన్‌వేల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మ్యాక్స్ తనకు చెందిన స్థలాన్ని అమ్ముతానంటూ మోహన్‌వేల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 2018లో మోహన్‌వేల్ దాదాపు 9 లక్షల రూపాయలు మ్యాక్స్‌కు ఇచ్చాడు. దీంతో స్థలానికి సంబంధించిన పట్టాలను మ్యాక్స్..మోహన్ వేల్‌కు ఇచ్చాడు. అంతేకాదు! పవర్ ఆఫ్ అటార్నీ కూడా మోహన్ పేరిట మార్చాడు. అయితే, తన స్థలం కొంత వివాదంలో ఉందంటూ మ్యాక్స్ స్థలం పట్టాలను మోహన్ దగ్గరినుంచి తిరిగి తీసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత పవర్ ఆఫ్ అటార్నీని కూడా రద్దు చేశాడు. దాన్ని వేరే వ్యక్తి పేరు మీదకు మార్చాడు. తర్వాత స్థలాన్ని హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి అమ్మటానికి సిద్ధపడ్డాడు. దీంతో మోహన్‌వేల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాన్ మ్యాక్స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, స్థలం అమ్మకం పేరుతో మోహన్ వేల్‌ను మోసం చేసిన తమిళ నిర్మాత జాన్ మ్యాక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.