Venkateswarlu
Venkateswarlu
ప్రేమ.. నిర్వచనం లేని ఓ గొప్ప అనుభూతి. ప్రేమలో పడ్డవారు డ్రగ్స్ తీసుకున్న వారికంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాము ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. చంపటానికైనా..చావటానికైనా వెనుకాడరు. ఈ నేపథ్యంలోనే సమాజంలో ఎన్నో విషాదాలు, దారుణాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. తాజాగా, ఓ పాకిస్తాన్ మహిళ తాను ప్రేమించిన యువకుడి కోసం పెద్ద సాహసమే చేసింది. నలుగురు పిల్లలు ఉన్న ఆమె ఏకంగా పాకిస్తాన్‌నుంచి ఇండియాలోకి చొరబడింది. అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించటంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన సీమ హైదర్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది.
ఆమెకు నలుగురు సంతానం కూడా ఉన్నారు. 2020 కరోనా సమయంలో పబ్‌జీ ద్వారా సీమకు ఢిల్లీకి చెందిన సచిన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పబ్‌జీ కారణంగా ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసినా.. సచిన్ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. ఇండియాకు వస్తే పెళ్లి చేసుకుందామని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి గత మే నెలలో దొంగతనంగా ఇండియాకు వచ్చింది. సచిన్‌తో కలిసి ఓ ఇళ్లు తీసుకుని నివాసం ఉండసాగింది. పెళ్లి విషయంలో చట్ట పరమైన చిక్కులు వస్తాయని భావించిన సచిన్, సీమ ఓ లాయర్‌ను కలిశారు. విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగారు. అయితే, సదరు లాయర్ వీరికి సహాయం చేయకపోగా..
సీమ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సచిన్, సీమలతో పాటు నలుగురు పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. సీమ అనుమతి లేకుండా భారత్‌లోకి ప్రవేశించటంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘‘ తాను పాకిస్తాన్‌లో గృహహింస ఎదుర్కొంటున్నానని సీమ చెప్పింది. తన భర్త ప్రతీ చిన్న విషయానికి ఆమెను ఏడిపించేవాడట. ప్రస్తుతం ఆమె భర్త సౌదీ అరేబియాలో ఉన్నాడట. నాలుగేళ్లుగా ఇద్దరూ కలవలేదట. సీమ తన సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పని చేస్తున్నాడని చెప్పింది. సీమ, సచిన్ జనవరి నెలలో నేపాల్‌లో కలుసుకున్నారు. కలిసి జీవిద్దామని అప్పుడే నిర్ణయించుకున్నారు’’ అని తెలిపారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.