Mango Man ఒకటి ఐశ్వర్య, మరోటి నరేంద్ర మోడి, ఒకే చెట్టుపై 300 రకాల మామిడి పండ్లు పండించిన మ్యాంగో మ్యాన్

ఏడో తరగతిలోనే స్కూలు మానేసిన కలీమ్ అంత చిన్న వయసులోనే అంటు కట్టే పద్ధతి (grafting) ద్వారా మామిడిలో కొత్త వంగడాలు సృష్టించడం మొదలు పెట్టాడు. మొదట్లో ఒకే చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లు కాసేలా గ్రాఫ్టింగ్ చేశాడు. కానీ తుఫానుకి నేలకొరిగింది.

ఏడో తరగతిలోనే స్కూలు మానేసిన కలీమ్ అంత చిన్న వయసులోనే అంటు కట్టే పద్ధతి (grafting) ద్వారా మామిడిలో కొత్త వంగడాలు సృష్టించడం మొదలు పెట్టాడు. మొదట్లో ఒకే చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లు కాసేలా గ్రాఫ్టింగ్ చేశాడు. కానీ తుఫానుకి నేలకొరిగింది.

మీరు మ్యాంగో మ్యాన్ గురించి విన్నారా? 120 ఏళ్ళ నాటి మామిడి చెట్టుకు 300 రకాల మామిడి పండ్లు పండించిన కృషీవలుడాయన. అసలు పేరు కలీముల్లా ఖాన్. ఊరు లక్నో సమీపంలోని మలీహాబాద్. ఏడో తరగతిలోనే స్కూలు మానేసిన కలీమ్ అంత చిన్న వయసులోనే అంటు కట్టే పద్ధతి (grafting) ద్వారా మామిడిలో కొత్త వంగడాలు సృష్టించడం మొదలు పెట్టాడు. మొదట్లో ఒకే చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లు కాసేలా గ్రాఫ్టింగ్ చేశాడు. కానీ తుఫానుకి నేలకొరిగింది. అయినా కలీమ్ నిరుత్సాహపడలేదు. మళ్ళీ తన ప్రయోగాలు మొదలుపెట్టాడు. 1987లో మొదలైన ఈ ప్రయోగాల ఫలితంగా ఇప్పుడు 120 ఏళ్ళ నాటి చెట్టుకు, 300 రకాలకు పైగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ప్రతి రోజూ మైలు దూరం నడిచి మరీ ఆ చెట్టును చూసుకుని వస్తాడాయన. మామూలు కంటితో చూస్తే ఇదొక సాధారణమైన చెట్టు. కానీ మనసుతో చూస్తే అదో పెద్ద తోట, ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాంగో కాలేజ్ (mango college) అంటూ కలీముల్లా మురిసిపోతాడు.

తొలి రోజుల్లో సృష్టించిన వంగడాల్లో ఒక దాని పేరు ఐశ్వర్య. ఈ పండు “ఐశ్యర్య” లాగే అందంగా ఉంటుందని ముసిముసి నవ్వులు కురిపిస్తాడు. ఇది ఒక్కోటి కిలో బరువు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు కలిసిన తొక్కతో మహా తీయగా ఉంటుందట. ఇక “అనార్కలి” రకపు పండు పై తొక్క రెండు రంగుల్లో, రెండు పొరలుగా ఉంటుంది. లోపలి గుజ్జు కూడా రెండు రుచుల్లో ఉంటుంది. ఇవేనా? నరేంద్ర మోడి, సోనియా గాంధీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లు పెట్టుకున్న మామిడి రకాలు ఈయన తోటలో కనువిందు చేస్తుంటాయి.

ఉద్యానవన రంగంలో (horticulture) కలీముల్లా కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.

Show comments