కర్ణాటక తరహా వివాదాలు జరగనివ్వం అంటున్న ఎమ్మెల్యే

కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కర్ణాటకలో మాత్రమే కాకుండా కొన్ని కీలక రాష్ట్రాల్లో దీని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారే సూచనలు కనపడుతున్నాయి. హిందు ముస్లిం భాయి భాయి అని చెప్పుకునే దేశంలో ఈ పరిస్థితి ఏంటీ అని కొందరు అంటే… సమస్యే లేదు అని కొందరు అంటూ నిరసనలకు దిగడం, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ హడావుడి చేయడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.

ఇది మా సాంప్రదాయం అని ఒకరు అంటే ఇది మా గౌరవం అని మరికొందరు అంటున్నారు. ఇదలా ఉంచితే… ఇప్పుడు హైదరాబాద్ లో హిజాబ్ కు అనుకూలంగా కొందరు నిరసనలకు దిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఈ తరుణంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నేడు. ఎంఐఎం పార్టీ తో టిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని బిజెపి విమర్శిస్తోంది అని మండిపడుతూ.. ఎంఐఎం అధినేత ఓవైసీ పై కాల్పులు జరిగిన తీరును చూస్తే ఎవరు ఎవరితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో అర్థమవుతుంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక లో జరుగుతున్న గొడవ.. ఎక్కడ తెలంగాణ వరకు వ్యాపిస్తుందో అన్న ఆందోళన కలుగుతోంది అన్నారు. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం స్వార్థబుద్ధితో కర్ణాటకలో హింసను ప్రేరేపిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండు మతాలకు చెందిన విద్యార్థులు కొట్టుకునే స్థాయికి దిగజారిందన్నారు. గొడవ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మొదలైతే.. హైదరాబాద్ లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తామంతా హిందువులమే అయినప్పటికీ బిజెపి చేస్తున్న జైశ్రీరామ్ నినాదాల వల్ల.. తాము జైశ్రీరామ్ అనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంపై భక్తి ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి కూడా మువ్వన్నెల జెండా ఉండటంతో జాతీయ పతాకాన్ని తాము పెట్టుకోలేకపోతున్నామన్నారు. 

Also Read : ‘హిజాబ్‌’పై న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ

Show comments