Idream media
Idream media
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్డు మీదకు వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేదో అనే ఆందోళన ఎక్కువ అవుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప కుమారై వివాహం అనంతరం బళ్లారి నుంచి బంధువులతో కలసి ఇన్నోవా వాహనంలో వస్తున్న సమయంలో ఇన్నోవా కారుని లారీ ఢీ కొన్నది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టినా సరే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలలేదు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద రోడ్డు జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మోడీ. వాహనంలో ఉన్న వాళ్ళు అందరూ మరణించడం తీవ్ర విషాదం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 5మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు అని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై సిఎం జగన్ తో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పేర్లు ఒకసారి చూస్తే… అశోక్- బొమ్మణహల్, రాదమ్మా- బొమ్మణహల్, సరస్వతి-బొమ్మణహల్, శివమ్మ పిల్లల పల్లి, శుభద్రమ్మ- రాయలప్పదొడ్డి, .స్వాతి- 38-లత్తవరం, జాహ్నవి- 12 లత్తవరం, వెంకటప్ప-60-నింబగల్లు, జశ్వంత్-12-లత్తవరం. ఇక ఈ ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.