Idream media
Idream media
మహేష్ బ్యాంకు హ్యాకింగ్ విషయంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రతీ విషయాన్ని సీరియస్ గా ఫోకస్ చేసిన అధికారులు ఈ కేసులో కీలక ఆధారాలు సంపాదించారు. చైనాకు చెందిన కొందరు వ్యక్తులతో పాటుగా నైజీరియా వ్యక్తులు ఉన్నారనే అంచనాకు వచ్చారు దాదాపుగా. ఈ నేపథ్యంలో కొందరిని అదుపులోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులకు కొన్ని సవాళ్లు ఎదురు అవుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా, 128 ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయని గుర్తించారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ తో హ్యాకింగ్ చేసిన నైజీరియన్లు… హ్యాకింగ్ సమయంలో రెడ్ ట్యాగ్ మోగకుండ జాగ్రత్త పడ్డారు. సేవింగ్స్ ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అయితే ఆర్బీఐ తో పాటు ఐటీ శాఖకు రెడ్ ట్యాగ్ అలారం వెళ్తుంది. రెడ్ ట్యాగ్ మోగితే హాకింగ్ గురించి వెంటనే ఆర్బీఐ కు సమాచారం వెళ్తుందని ముందే గ్రహించారు. రెడ్ ట్యాగ్ మోగకుండా జాగ్రత్త పడి తంతు ముగించారు.
వ్యాపారవేత్తల కరెంట్ ఖాతాలోకి నగదు బదిలీ చేసుకుని రెడ్ ట్యాగ్ వెళ్లకుండా బ్లూ ప్రింట్ ప్లాన్ చేసుకున్నారు. బదిలీ చేసుకున్న నగదు ను 128 ఖాతాల్లోకి తక్కువ మొత్తంలో మళ్ళించడం గమనార్హం. ఈ 128 ఖాతాలు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంలో ఢిల్లీ వెళ్లిన పోలీసుల బృందంకు ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లీలో ఓ నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై నైజీరియన్ దాడి చేశాడు.
నైజీరియన్ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి అని పోలీస్ శాఖ ప్రకటించింది. గతంలో పలుమార్లు ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది పోలీసులకు ఇబ్బందులు వచ్చాయి. తమిళనాడు నుంచి రాజస్థాన్ వెళ్ళిన పోలీసులపై అక్కడి గ్రామస్తులు దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం ఇతర రాష్ట్రాల పోలీసులకు సహకారం అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై దక్షిణాది పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఈ కేసులో మరికొందరిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read : ముందు ఎర్ర జెండా.. వెనుక పచ్చ అజెండా – బాబు అండ్ కో తీరును తూర్పారబట్టిన సీఎం జగన్