నేటితో పూర్తికానున్న అన్‌లాక్‌ 1.0: రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ప్రకారం జూన్‌ 30 నాటికి అన్‌లాక్‌ 1.0 పూర్తయి..జూలై 1 నుంచి అన్‌లాక్‌ 2.0 మొదలు కానుంది. కానీ, కేసుల సంఖ్య ఆందోళకర స్థాయిలో పెరిగి 5 లక్షలు దాటేయడం.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో లేకుండా పోవడంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ‘అన్‌లాక్‌ 2.0’కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అన్‌లాక్‌ 1.0 నేటితో పూర్తి కానుంది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో లేకుండా పోవడంతో ప్రస్తుతం దేశవ్యాప్తం గా అమలవుతున్న సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ జూలై 31 వరకూ యథావిధిగా అమలవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. జూలై 31 వరకూ కంటైన్మెంట్‌ జోన్లలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలవుతుందని, కట్టడి ప్రాంతాల్లో కేవలం నిత్యావసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా థియేటర్లు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, ప్రార్థనా మందిరాలకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, రోజురోజుకీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. చెన్నైలో మాదిరి లాక్‌డౌన్‌ను హైదరాబాద్‌లో విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అక్కడక్కడ వ్యాపారులు సమావేశమై సంపూర్ణబంద్‌ పాటిస్తున్నారు. ఏపిలోనూ ప్రాంతాల వారీగా ఆంక్షలు విధించబోతున్నది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లో అంతర్రాష్ట్ర, స్థానిక ప్రయాణాలపై నిషేధం విధించారు.

అస్సాం రాజధాని గువహతి ఉన్న జిల్లాలో ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మందులషాపులు తప్ప మరేవీ తెరవటం లేదు. మహారాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా తొలగించబోమని సిఎం ఉద్ధవ్‌ థాకరే ఇప్పటికే స్పష్టం చేశారు. ముంబయి ప్రజలు తమ నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధి దాటి బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచించారు. శని,ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించాలని కర్నాటక సర్కారు నిర్ణయించింది. మణిపూర్‌లో జూలై 15 దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సిఎం బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు.

కొన్ని రాష్ట్రాలు కట్టడి ప్రాంతాలకే ఆంక్షలను పరిమితం చేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయిస్తున్నాయి. తెలంగాణ సిఎం కూడా మళ్లీ లాక్‌డౌన్‌ విధించనున్నట్టు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో.. ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తే..

పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను జూలై 31 దాకా పొడిగించారు. అయితే, ఈ ఆంక్షలు ఆ రాష్ట్రంలోని కట్టడి ప్రాంతాలకు మాత్రమే పరిమితం. జూలై 1 నుంచి రాత్రిపూట కర్ఫ్యూను 10 గంటల నుంచి 5 గంటల దాకా కుదించారు. జార్ఖండ్‌లో కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను జూలై 31 దాకా పొడిగించారు. అంతర్రాష్ట్ర, స్థానిక ప్రయాణాలపైనా నిషేధం ఉంటుంది.

అస్సాంలోని కామరూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాలో (అస్సాం రాజధాని గౌహతి ఉన్న జిల్లా) ఇప్పటికే 14 రోజుల కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జూన్‌ 28 నుంచి జూలై 12 దాకా.. ఆ జిల్లాలో ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మందులషాపులు తప్ప మరేవీ తెరవరు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కొన్ని కంటోన్మెంట్ జోనుల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి) పరిధిలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది.

మహారాష్ట్రలోని నవీముంబైలోని పది కట్టడి ప్రాంతాల్లో జూన్‌ 29 నుంచి జూలై 5 దాకా కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుకానున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా తొలగించబోమని సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ముంబై ప్రజలు తమ నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధి దాటి బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచించారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి.. ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. జూలై 10 నుంచి ప్రభుత్వ కార్యాలయాలేవీ శనివారం పనిచేయవు. మణిపూర్‌లో జూలై 15 దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సిఎం బీరెన్‌ సింగ్‌ ప్రకటించారు.  

Show comments