ఈసీ నిర్ణ‌యం.. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌పై ప్ర‌భావం

బండి సంజ‌య్ పాద‌యాత్రే.. తెలంగాణ‌లో బీజేపీకి ఆయువు ప‌ట్టుగా మార్చుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ముగింపు స‌భ‌ను అక్క‌డ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టేందుకు అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతున్నారు. అయితే.. బండి సంజయ్ కు ఎన్నికల కోడ్ కష్టాలు తెచ్చిపెట్టింద‌నే చెప్పాలి. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల నేపథ్యంలో పలు ఆంక్షలను ఎన్నికల సంఘం విధించింది. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేలా ముగింపు హుజూరాబాద్ లో ఉండేలా ప్లాన్ చేసిన బండి సంజయ్ కు ఇప్పుడ‌దే కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది.

బుధవారం బండి సంజయ్ పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో ముగుస్తుంది. గురవారం నుంచి కరీంనగర్ జిల్లాలోకి ఆయన పాదయాత్ర ప్రవేశిస్తుంది. అక్టోబర్ 2వ తేది హుజురాబాద్లోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అదే రోజు హుజురాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ కష్టాలు ఆ పార్టీ వచ్చాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదంటూ ఈసీ నిబంధన విధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం కఠిన ఆంక్షలు విధించింది. 500లకు మించి జనసమీకరణ ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.

Also Read : ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన మీద బండి ప్లాన్ ను హైక‌మాండ్ ఓకే చేస్తుందా?

ఎన్నికల సంఘం నిబంధనతో బీజేపీ నేతలు చిక్కుల్లోపడ్డారు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లా వాసి కనుక వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాదయాత్రకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంజయ్ వెంటరోజూ పాదయాత్రకు వందలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం హుజురాబాద్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రూట్ మ్యాప్లో బీజేపీ నేతలు మార్పలు చేర్పులు చేస్తున్నారు. హుజురాబాద్ తగలకుండా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. బండి సంజయ్ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది. మూడుసారి అనుకున్నట్లే పాదయాత్ర ప్రారంభించారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై పాదయాత్ర ప్రభావం ఉంటుందని ఆ పార్టీ భావించింది. అయితే పాదయాత్ర హుజురాబాద్ను తాకకుండా పోవడం ఆ పార్టీకి నిరాశను కల్గించిందని అంటున్నారు.

హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా పాదయాత్రలోనే తన ఎన్నికల ప్రచారాన్నిమొదటు పెట్టారు. అనుకోని అవాంతాలు రావడంతో ఆయన పాదయాత్ర బ్రేక్ పడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తిరిగి పాదయాత్ర చేస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. ఎన్నికల నిబంధనల వల్ల ఆయన పాదయాత్రకు కూడా బ్రేక్ పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Also Read : హుజూరాబాద్ రేసులో కాంగ్రెస్ ఎక్క‌డ‌?

Show comments