iDreamPost
android-app
ios-app

నెచ్చలి… రాజకీయ కథకలి!

నెచ్చలి… రాజకీయ కథకలి!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలిగా… ఆమెకు అత్యంత ఆప్తురాలిగా పేరున శశికళ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో వేయబోయే వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆమె ఈ సారి జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. నేరాల్లో శిక్ష అనుభవించిన వారు వెంటనే చట్టసభల్లో పోటీ చేయకూడదన్నది చట్టం. దీనిని బట్టి శశికళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అప్పటికీ ఆమె వేయబోయే రాజకీయ అడుగులు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

ఇప్పటికే మేనల్లుడు దినకరన్ తో పార్టీ పెట్టించిన శశికళ.. ఇటు అన్నాడీఎంకే నేతలతో సైతం టచ్లో ఉన్నారు. మరో పక్క ఆమె అన్నాడీఎంకేకు మద్దతుగా తెలిపే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటూ… బిజెపి దీనికి మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు ఉన్నాయని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే శశికళ తీసుకోబోయే నిర్ణయం తుది వరకు ఎవరికీ అంతుబట్టని విధంగా తయారయింది.

అచ్చం ఆమెలా!!

దివంగత సీఎం జయలలిత వారసత్వం కోసం తమిళనాడు రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు సాగుతున్నాయి. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ అమ్మ వారసత్వం కోసం పోటీపడుతున్నారు. ఆమె లోటును భర్తీ చేసేందుకు శశికళ ఆమె హావభావాలతో పాటు… జయలలిత వినియోగించిన కారును సైతం వినియోగిస్తూ తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మార్క్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జైలలిత లాగే కార్యకర్తలను నవ్వుతూ పలకరిస్తూ, ఆమెలాగే తన హావభావాలను ప్రదర్శిస్తూ మెలగడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని కొత్త చర్చకు దారి తీసింది.

కారు మీద అమ్మ జెండా!!

ఇటీవల కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన శశికళ ఆమె ఉపయోగించే కారు మీద అన్నాడిఎంకె పార్టీ జెండా ఉండటం,ఆమె సైతం కార్యకర్తలను, జయలలిత మాదిరి పలకరించడం తో పాటు… జయలలిత హావభావాలను మీడియా ముందు చూపిస్తూ జయలలితను మరోసారి గుర్తు చేస్తూ ఆమె వారసురాలిగా ఆమెకు అత్యంత ఆప్తులు రాలిగా ఉన్న తన మార్కు ను మరింత విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శశికళ ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంగా పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు నాయకులు ఆమెకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టడం… ఆమె బయటకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకడం ఇవన్నీ అన్నాడీఎంకేతో చీలిక తెచ్చే సంకేతంగా భావిస్తున్నారు.

మరోపక్క అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు సైతం శశికళకు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎన్నికల ముందు శశికళ పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరెవరు వెళ్తారు ఎలా వెళ్తారు వారికి టికెట్లు ఏ పార్టీ నుంచి వస్తాయి అన్నది అసలైన ప్రశ్న. అన్నాడీఎంకే జెండాను ఉపయోగిస్తూ శశికళ కారు ఉపయోగించడాన్ని అన్నాడీఎంకే నాయకులు సైతం ఖండిస్తున్నారు. ఆమెను పార్టీ సస్పెండ్ చేసిందని… అలాంటి శశికళ కారు మీద ఎలా పార్టీ జెండాను ఉంచుకుంటారు అంటూ అన్నాడీఎంకే నాయకులు కస్సు బుస్సు లాడుతున్నారు.

ఎం చేయబోతున్నారు?

నిబంధనల ప్రకారం శశికళ 2027 నాటి మాత్రమే పోటీ చేయడానికి అర్హురాలు అవుతుంది. అంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో శశికళ పోటీ చేయడానికి లేదు. మరి ఆమె పార్టీ తరఫున ఎవర్ని నుంచో పెడతారు..? మేనల్లుడు దినకరన్ కు పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగిస్తార?? లేక పార్టీని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేలా చూస్తారా? బిజెపి ను ఎలా ఒప్పిస్తారు?? అసలు బీజేపీ శశికళ రాకను ఎంతమేర సమర్ధిస్తుంది వ్యతిరేకిస్తుంది అన్నది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారింది. దీంతో పాటు శశికళ వేసే ప్రతి అడుగు రాజకీయంగా వేసే ప్రతి ఎత్తుగడలో ఇటు బిజెపి అటు అన్నాడీఎంకే నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆమెతో పరిచయం ఉండే ఎమ్మెల్యేలపై, టచ్ లో ఉండే నేతలపై అన్నా డీఎంకే ప్రభుత్వం నిఘా ఉంచింది.

అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ పెద్దల పనులన్నీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు శశికళ ఏం చేయబోతున్నారు తమిళనాడు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్న అన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత వారసత్వం కోసం… సానుభూతి కోసం శశికళ ప్రధానంగా ఈ వ్యూహం ఎంచుకున్నట్లు… అమ్మ తర్వాత అమ్మకు అత్యంత ఆప్తుడుగా తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ఈ వ్యూహాత్మక ఎత్తుగడ అనుసరిస్తున్నారని, గతంలో ఎప్పుడూ అమ్మ హావభావాలను పలకని ఆమె కొత్తగా ఇప్పుడు జయలలిత మాదిరి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆసక్తికర చర్చ నడుస్తోంది.