రైల్వే గుడ్ న్యూస్.. త్వరలో బెంగళూరు నుండి హై స్పీడ్ రైలు

ప్రయాణీకులు, సరుకు రవాణా సామర్థ్యం రెండింటినీ పెంచే లక్ష్యంతో భారత రైల్వే వ్యవస్థ.. తన రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గణనీయమైన చర్యలు చేపడుతుంది. ఇందులోభాగంగా కొత్త ట్రైన్స్, మార్గాలను అన్వేషిస్తుంది.

ప్రయాణీకులు, సరుకు రవాణా సామర్థ్యం రెండింటినీ పెంచే లక్ష్యంతో భారత రైల్వే వ్యవస్థ.. తన రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గణనీయమైన చర్యలు చేపడుతుంది. ఇందులోభాగంగా కొత్త ట్రైన్స్, మార్గాలను అన్వేషిస్తుంది.

భారత రైల్వే వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు వందే భారత్ రైల్వేలను అందిస్తుంది. సెమీ హై స్పీడ్ రైళ్లతో పాటు త్వరలో బుల్లెట్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాగే ఈ ట్రైన్స్ రాకపోకలు సాగించేందుకు ఆయా మార్గాలను ఆధునీకరించడంతో పాటు కొత్త కొత్త మార్గాలను రూపొందిస్తుంది. అలాంటి వాటిలో ఒకటి బెంగళూరు-ముంబయి ఇండస్ట్రీయిల్ కారిడార్. ఈ రెండు నగరాలు రాకపోకలు త్వరగా సాగించేందుకు హై స్పీడ్ రైలును ప్రవేశ పెట్టనుంది రైల్వే శాఖ. ఈ మేరకు కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పంపింది. కర్ణాటకలోని తమకూరు, దావణ గెరె, హుబ్లీ, ధార్వాడ్, బెళగావి మీదుగా బెంగళూరు-పూణెలను కలుపుతూ హై స్పీడ్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది.

బెంగళూరు-పూణె- ముంబయి మధ్య ఇండస్ట్రీయల్ కారిడార్‌కు శ్రీకారం చుట్టిన కేంద్రం.. ఆ ప్రాంతంలో సంస్థల ఏర్పాటుకు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఈ కారిడార్ విషయానికి వస్తే కర్ణాటకలోని ఆరు స్మార్ట్ సిటీలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతో తమకూరు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ్, బెళగావి నగరాలు స్మార్ సిటీల కింద వేగంగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే దేశ రాజధాని హస్తీనా నుండి ముంబయి పారిశ్రామిక కారిడార్‌ను డెవలప్ చేస్తున్న సంగతి విదితమే. దీనితో పాటు బెంగళూరు- ముంబై ఇండస్ట్రీయల్ కారిడార్‌ను పూర్తి చేయాలని యోచిస్తుంది రైల్వే శాఖ. ఇందులో నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్ మెంట్ ప్లాన్‌లో భాగమైన తమకూరు ఇండస్ట్రీయల్ టౌన్ షిప్, కర్ణాటక ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్ మెంట్ బోర్డు అభివృద్ధి చేసిన తమకూరు మెషిన్ టూల్స్ పార్క్, జపాన్ పారిశ్రామిక హబ్‌లను డెవలప్ చేస్తున్నారు.

అలాగే హుబ్లీ-ధార్వాడ ఇండస్ట్రీయిల్ హబ్ డెవలప్ మెంట్ కోసం 605 ఎకరాలను సేకరించారు. అక్కడ ఇప్పటికే పలు ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పడ్డాయి. అలాగే ధార్వాడలో ఐఐటీ, ఐఐఐటీతో పాటు అగ్రికల్చర్ యూనివర్శిటీ వంటి విద్యా సంస్థలున్నాయి. బెళగావిలో ఏరో స్పేస్ సెజ్ ఏర్పడింది. అలాగే అక్కడ పారిశ్రామిక హబ్‌ను డెవలప్ చేస్తున్నారు. బెళగావిలో కర్ణాటక లా యూనివర్శిటీ, కర్ణాటక వర్శిటీ, విశ్వేశ్వరయ్య టెక్నాజికల్ యూనివర్శిటీలు ఉండటం వల్ల రెండు నగరాలు విద్యా కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. బెంగళూరు – ముంబయి ఇండస్ట్రీయల్ కారిడార్‌ వల్ల తమకూరు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ్, బెళగావి నగరాలు పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చెందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు అందించింది రైల్వే శాఖ.

Show comments