Venkateswarlu
Venkateswarlu
దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వీధి వీధినా గణేష్ ప్రతిమలు కొలువు దీరాయి. కోటీశ్వరుడి దగ్గరినుంచి పేదవారి వరకు తమ తాహతకు తగ్గట్టు వినాయకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ తన రేంజ్‌కు తగ్గట్టు ఇంట్లో కూడా వినాయక విగ్రహం ఏర్పాటైంది. వినాయక చవితి రోజున ముఖేష్ అంబానీ కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంట్లోని విగ్రహానికి పూజలు చేసింది. అనంతరం ముఖేష్ అంబానీ ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ లాల్‌బగీచా రాజా దగ్గరకు వెళ్లారు.
అక్కడి వినాయక విగ్రహాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వినాయకుడికి అంబానీ ఇచ్చిన గిఫ్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన 2 వేల నోట్ల రూపాయలతో తయారు చేసిన పెద్ద దండను వినాయకుడికి ఇచ్చారు. ప్రస్తుతం ఆ 2 వేల నోట్ల దండకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దండపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ దండ అంబానీ రేంజ్‌కు తగ్గట్టుగా ఉంది’’..‘‘ అంబానీ ఏం చేసినా అది ఖరీదుగానే ఉంటుంది. దేవుడి పూజ చేసినా అంతే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ప్రతీ సంవత్సరం వినాయక చవితి రోజున ముఖేష్ అంబానీ లాల్‌బగీచా రాజాను దర్శించుకుంటూ ఉంటారు. తన రేంజ్‌కు తగ్గట్టు వినాయకుడికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఈ సారి 2 వేల నోట్ల రూపాయల ఇచ్చారు. ఇక, అంబానీకి దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా వినాయకుడంటే ఎంతో భక్తి. అందుకే ప్రతీ సంవత్సరం తన పుట్టిన రోజు సందర్భంగా వినాయకుడ్ని దర్శించుకుంటూ ఉంటారు. మరి, అంబానీ లాల్‌బగీచా రాజాకు 2 వేల నోట్ల రూపాయల దండ బహుమతిగా ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.