రాజమౌళి షేర్ చేసిన సింహం వెనుక ఇంత స్టోరీ ఉందా!

SSMB 29 Updates: ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే జక్కన్న ప్రేక్షకులలో క్యూరియాసిటి పెంచేస్తున్నాడు. రీసెంట్ గా అడవులలో తిరుగుతూ కొన్ని వైల్డ్ యానిమల్స్ ఫోటోస్ ను షేర్ చేశాడు. అందులో షేర్ చేసిన సింహం ఫోటో వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. అదేంటో చూసేద్దాం.

SSMB 29 Updates: ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే జక్కన్న ప్రేక్షకులలో క్యూరియాసిటి పెంచేస్తున్నాడు. రీసెంట్ గా అడవులలో తిరుగుతూ కొన్ని వైల్డ్ యానిమల్స్ ఫోటోస్ ను షేర్ చేశాడు. అందులో షేర్ చేసిన సింహం ఫోటో వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. అదేంటో చూసేద్దాం.

పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తే సరిపోదు.. ఆ రేంజ్ మూవీని మార్కెట్ చేయడం కూడా రావాలి. అందులో జక్కన్నకు మించిన వారు ఎవరు లేరు. అది మాత్రమే కాదు.. ఓ భారీ సినిమాను తీసుకువచ్చే ముందు.. ఆడియన్స్ ను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా జక్కన్నను చూసి నేర్చుకోవాల్సిందే. రాజమౌళి ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ వేటలో ఉన్నాడు. దానికి సంబంధించి ఫోటోలు , వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. SSMB 29 పై స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాడు. జస్ట్ లొకేషన్ హంట్ తోనే సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం రాజమౌళికే సాధ్యం. కార్తికేయ , రాజమౌళి ఆఫ్రికన్ అడవుల్లో చక్కర్లు కొడుతు.. షేర్ చేస్తున్న జంతువుల ఫొటోలతో ఎక్కడ లేని ఎగ్జైట్ మెంట్ ప్రేక్షకులలో క్రియేట్ అవుతుంది.

మహేష్ కూడా వెళ్లి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ.. వీరు షేర్ చేసిన పిక్స్ కే అభిమానులు ఊగిపోతున్నారు. ఆ ఫోటోలను  సోషల్ మీడియాలో  షేర్ చేస్తున్నారు. ఈ వైల్డ్ యానిమల్స్ సెంటిమెంట్ ఏంటి బాసు..! మా బాబు ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు . ఇక రీసెంట్ గా రాజమౌళి ఓ సింహం ఫోటో ముందు నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దానికి “క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంజెటీ రాజుకు సంబంధించిన ఫోటో ఇది. దీని పేరు బాబ్ జూనియర్” అంటూ క్యాప్షన్ జోడించారు. ఆ సింహానికి మహేష్ బాబు పేరుని కూడా ట్యాగ్ చేశారు. దానికి మహేష్ కూడా లవ్ ఎమోజిస్ తో రిప్లై ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే జక్కన్న ఏం చేసినా అందులో అర్ధం పరమార్థం ఉంటాయి. అలాగే ఈ ఫోటో వెనుక కూడా ఓ స్టోరీ దాగి ఉంది. అడవికి రారాజు అయిన సింహం ఫోటోతో.. ఇండైరెక్ట్ గా ఆ రాజు మహేష్ బాబు అనే విషయాన్నీ వెల్లడించారు. సెరెంజెటీ అనేది టాంజానియాలో ఉన్న ఒక ప్రాంతం. ఆ సింహం విషయానికొస్తే.. అదే సెరెంగెటి నేషనల్ పార్క్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేదట. దాని పేరు బాబ్ జూనియర్. అక్కడి వచ్చే సందర్శకులకు గొప్ప అనుభూతిని కలిగించేదట. అత్యంత ఆకర్షణీయమైన ఫోటో జెనిక్ ఫేస్ కలిగిన మృగరాజుగా దీని ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

జమైకన్ గాయకుడు బాబ్ మార్లే స్మారకంగా దానికి ఆ పేరు పెట్టారట. అయితే ఓ రోజు అనుకోకుండా తన కన్నా చిన్నవైన సింహల చేతుల్లో బాబ్ జూనియర్ హత్యకు గురైందట బాబ్ జూనియర్. తమ్ముడిగా భావించే ట్రైగ్వె అనే మరో సింహం కూడా అదే ఘటనలో చనిపోయిందట. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అంత చరిత్ర కలిగిన సింహం ఫోటోను రాజమౌళి షేర్ చేయడంతో.. అభిమానులలో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. దీని ఆధారంగా జక్కన్న సినిమా కథ ఉంటుందా? మహేష్ ను ఈ సింహాన్ని ఎలా లింక్ చేయబోతున్నారు ? అంటూ కొందరికి  సందేహాలు స్టార్ట్ అయ్యాయి. ఏదైతేనేం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినా SSMB అప్డేట్స్ మెల్ల మెల్లగా వస్తున్నాయి… అదే చాలని అనుకుంటున్నారు మరి కొందరు. ఇక ఫ్యూచర్ లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments