సమంత హెల్త్‌ టిప్‌.. అలా చేస్తే డైరెక్ట్‌గా చావే అంటూ డాక్టర్‌ ఫైర్‌

నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేశావో మొదలైన ఆమె ప్రయాణం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇటీవల మయోసైటిస్ బారిన పడ్డ.. ఆమె ఇటీవల పూర్తిగా కోలుకుంది. అయితే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని టిప్స్ పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి

నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేశావో మొదలైన ఆమె ప్రయాణం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇటీవల మయోసైటిస్ బారిన పడ్డ.. ఆమె ఇటీవల పూర్తిగా కోలుకుంది. అయితే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని టిప్స్ పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడి పూర్తిగా కోలుకుంది. శాకుంతలం మూవీ సమయంలో అరుదైన వ్యాధి బారిన పడిన సామ్.. ఆ తర్వాత చికిత్స తీసుకుంది. కోలుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించింది. గత ఏడాది శాకుంతలం, ఖుషీ సినిమాలతో అలరించిన ఈ చిల్ బులీ.. ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి విదితమే. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. కాగా, ఇప్పటికే వెబ్ సిరీస్ సీటాడెల్ : హనీ-బన్నీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తన నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం ప్రాజెక్టును ఎనౌన్స్ చేసింది. అయితే సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదిక షేర్ చేయగా.. వైద్యుడు స్పందించారు.

వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు అనవసరమైన మెడిసన్స్ జోలికి వెళ్లకుండా.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చేస్తే..మ్యాజిక్‌లా పనిచేస్తుంది’ అంటూ తను నెబిలైజర్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. దీనిపై లివర్ డాక్టర్ సామ్ పై ఫైర్ అయ్యారు. ‘ఆరోగ్యం, సైన్స్ గురించి సరిగ్గా తెలియని సమంత. శ్వాసకోశ వైరల్ ఇన్ ఫెక్షన్లను నివారించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడమని చెబుతుంది. ఇంత కంటే బుద్ది తక్కువ పని మరోటి లేదు. సైంటిఫిక్ సొసైటి ది ఆస్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్యానికి ప్రమాదమని, నెబ్యులైజ్ చేయద్దని, ప్రజలను హెచ్చరించింది. ఆమెకు సాయం అవసరం.. అలాగే మెరుగైన సలహాదారుడు అవసరం’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

అలాగే సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చెబుతున్నారు కొంత మంది ఇన్ల్లుయెన్సర్లపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఏదైనా హెల్త్ రెగ్యులేటరీ బాడీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది.. ఈ సలహాల వల్ల ప్రజలు చనిపోయే అవకాశం కూడా ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్‌స్టేబుల్ రసాయనం, ఇది నీరు, ఆక్సిజన్‌గా మారుతుంది. అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారేముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్‌లా పనిచేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కు గానీ దారి తీస్తుంది. ఇదొస్తే డైరెక్టు సావే. ఇక మీ ఇష్టం’ అంటూ సూచించారు. కాగా, గతంలో కూడా సమంత ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. కాలేయం శుద్ది చేయడం అనే అంశంపై గతంలో ఓ పాడ్ కాస్ట్ ద్వారా చర్చించగా.. తెలిస్తే తెలిసినట్లు మాట్లాడాలి కానీ.. అజ్ఞానాన్ని పంచుతారా అంటూ గతంలో ఓ డాక్టర్ మండిపడిన సంగతి విదితమే.

Show comments