ఏంమాయ చేశావే అంటూ సమంత తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సమంత క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎలాంటి క్యారెక్టర్ నైనా సమంత సునాయాసంగా చేసేస్తుంది. తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రి ముగ్దులను చేస్తుంటుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో హిందీలో కూడా సమంత ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది.
సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తన ఫ్రెండ్ అనుషా స్వామితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సమంత సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. తన డైలీ యాక్టివిటీస్, సినిమా అప్ డేట్స్ అన్నీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కు చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం సమంత తన టూర్ కి సంబంధించిన అప్ డేట్స్ తో అభిమానులను అలరిస్తోంది. గత నాలుగు రోజులుగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్న పోస్ట్స్ చూసి అభిమానులు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. పచ్చని ప్రకృతిలో, వన్యప్రాణులతో సమంత తన సమయాన్ని గడిపేస్తోంది. తాజాగా ఒక క్రేజీ డాన్స్ వీడియో పోస్ట్ చేసింది. గర్ల్స్ ట్రిప్ ని వందకు వంద శాతం ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్లుగా.. ఒక వీడియో పోస్ట్ చేసింది.
ఆ డాన్సింగ్ వీడియోలో అనుషా స్వామితో కలిసి సమంత కిల్లింగ్ మూవ్స్ తో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతా సమంత డాన్స్ వీడియోకి ఫిదా అయిపోయారు. ఇంక కెరీర్ విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తన హెల్త్ మీద శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాలు స్టార్ట్ చేస్తుందని టాక్ నడుస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజ్ కి దగ్గర పడుతోంది. అంతేకాకుండా ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో సమంత- వరుణ్ ధావన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ సిద్ధమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి సమంత అటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తోంది.